
ఐఫోన్.. దీనికి ఎంతో మంది అభిమానులుంటారు. ధర అధికంగా ఉన్నా.. కొనేందుకు ముందుకొస్తుంటారు. ఏదైనా కొత్త మోడల్ మార్కెట్లో విడుదల అవుతుందంటే వినియోగదారులు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా..? అని ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా ఆపిల్ ఫోన్‌పై మరో కీలక అప్‌డేట్ వినిపిస్తోంది. రాబోయే ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ పింక్ కలర్‌లో అందుబాటులో రానుందని సమాచారం. అయితే మార్కెట్లోకి రాకముందే ఈ ఫోన్‌పై పుకార్లు షికార్లు అవుతున్నాయి.
ఐఫోన్ 15 ఆకుపచ్చ, లేత పసుపు, గులాబీ రంగులలో వస్తుందని లీకులు వస్తున్నాయి. అయితే ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ గ్రే టోన్‌తో ముదురు నీలం రంగులో లభిస్తుందని గతంలో పుకార్లు కూడా వచ్చాయి. బ్లూ కలర్ కొత్త టైటానియం మెటీరియల్‌తో వస్తుందని, ఆపిల్ గతంలో కలిగి ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్‌కు బదులుగా బ్రష్డ్ ఫినిషింగ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా, కంపెనీ ఐఫోన్ 15 ప్రో కోసం ముదురు ఎరుపు రంగును, ఐఫోన్ 15, 15 ప్లస్‌లకు ఆకుపచ్చ రంగును పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. అయితే పింక్ కలర్‌లో రావడం ఇదే తొలిసారి. దీంతో పాటు మిగిలిన రెగ్యులర్ కలర్స్‌లో కూడా ఐఫోన్ 15 వస్తుంది. కాగా, ఐ ఫోన్ 15 సిరీస్ విడుదల తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
రాబోయే ఐఫోన్ 15లో కొత్త ఫీచర్స్ ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. A15 బయోనిక్ చిప్‌సెట్‌ని iPhone 15లో చూడవచ్చు. ఇది డైనమిక్ ఐలాండ్ ఫీచర్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రావచ్చని, ఐఫోన్ 15లో USB టైప్ C ఆప్షన్‌ను అందించడం మొదటి సారి అవుతుంది. అదే సమయంలో ఇది 48MP ప్రధాన కెమెరా ఫీచర్‌లతో వచ్చే అవకాశం ఉంది. దీని ధర $799 నుంచి $849 వరకు ఉంటుందని భావిస్తున్నారు. అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే 65వేల రూపాయల నుంచి 79 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి