- Telugu News Photo Gallery Technology photos Honor Launches new smart watch Honor watch 4 features and price details
Honor watch 4: హానర్ నుంచి ప్రీమియం స్మార్ట్ వాచ్.. సూపర్ లుక్, స్టన్నింగ్ ఫీచర్స్.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ తాజాగా చైనా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. హానర్ వాచ్ 4 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jul 17, 2023 | 3:26 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హానర్ సైతం స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హోనర్ వాచ్ 4 పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

హానర్ వాచ్ 4 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 450 x 390 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 1.75 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ వాచ్ ధర భారత మార్కెట్లో రూ. 10,850గా ఉండొచ్చని అంచనా.

ఇక బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చిన హానర్ వాచ్ 4లో 400 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 97 స్పోర్ట్స్ మోడ్‌లు, హార్ట్ బీట్ సెన్సార్, సైక్లింగ్, రన్నింగ్ వంటి ట్రాకింగ్ ఫీచర్లను అందించారు.

ఇక హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. ఎస్‌పీఓ2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం 5 ఏటీఎమ్ రేటింగ్‌ను ఇచ్చారు. ఇందులో 451 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 10 రోజుల పాటు పనిచేస్తుంది.





























