- Telugu News Photo Gallery Technology photos Realme launching new smart phone on july 19th Realme c53 features and price details
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రియల్‌మీ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 13వేలలోపు 108 ఎంపీ కెమెరా. లాంచ్ ఎప్పుడంటే..
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్ మీ సీ 53 స్మార్ట్ ఫోన్‌ను జులై 19వ తేదీన లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jul 16, 2023 | 5:19 PM

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి సీ 53 స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. జులై 19న మధ్యాహ్నం ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ మలేషియాలో విడుదలైంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

రియల్‌మీ సీ53 స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇతర దేశాల్లో లాంచ్ అయిన ధరల ఆధారంగా ఈ ఫోన్ ధర రూ. 13వేల లోపు ఉండొచ్చని అంచనా వేశారు.




