AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనీ నుంచి సూపర్‌ స్మార్ట్‌ ఫోన్‌..! ఈ నెల 13న లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే!

సోనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Sony Xperia 1 VIని మే 13న లాంచ్ చేయనుంది. ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ట్రిపుల్ కెమెరా, 120Hz OLED డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

సోనీ నుంచి సూపర్‌ స్మార్ట్‌ ఫోన్‌..! ఈ నెల 13న లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే!
Sony Xperia 1
SN Pasha
|

Updated on: May 09, 2026 | 3:15 AM

Share

టెక్ దిగ్గజం సోనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మే 13న అధికారికంగా లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. జపాన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నిర్వహించనున్న ఈ లాంచ్ ఈవెంట్‌లో కొత్త Xperia 1 సిరీస్ ఫోన్‌ను పరిచయం చేయనుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో నెక్ట్స్‌ వన్‌ ఈజ్‌ కమింగ్‌ అనే ట్యాగ్‌లైన్ కనిపించడం వల్ల, ఇది రాబోయే Sony Xperia 1 VIII మోడల్ అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ వినియోగదారులు కూడా ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం మే 13 రాత్రి 7:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభమవుతుంది. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం ఇది ఉదయం 11 గంటలకు జరుగుతుంది. కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానల్, Xperia ప్రత్యేక వెబ్‌పేజీలో ఈ లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉండనుంది.

టీజర్ ప్రకారం కొత్త Xperia ఫోన్‌లో నిలువుగా అమర్చిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. L ఆకారంలో కనిపిస్తున్న ఈ కెమెరా డిజైన్, ఇప్పటికే లీకైన రెండర్‌లతో సరిపోవడం గమనార్హం. ఫోటోగ్రఫీ ఫీచర్లపై సోనీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాప్-టైర్ కెమెరా సామర్థ్యాలను అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే ఉండొచ్చు. అలాగే ప్రధాన 24mm కెమెరాతో పాటు అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లు కూడా ఉండనున్నాయి. సోనీకి ప్రత్యేకమైన పొడవైన డిస్‌ప్లే డిజైన్, ప్రీమియం లుక్ ఈ ఫోన్‌లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

కలర్స్‌ విషయానికొస్తే గార్నెట్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్, లోలైట్ సిల్వర్ కలర్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. యూరప్ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర 1,868.99 యూరోలు వరకు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2 లక్షలకుపైగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో సోనీ WH-1000XM6 ప్రీమియం వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు బండిల్‌గా వచ్చే అవకాశం కూడా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌