Social Media: మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారా? అయితే..మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే!

సోషల్ మీడియా మానసికంగా మాత్రమే హాని చేస్తుందని మీరు అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. దాని భౌతిక దుష్ప్రభావాలు మానసిక ప్రభావాలతో సమానంగా భయంకరమైనవి.

Social Media: మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారా? అయితే..మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే!
Social Media Effect

Social Media: సోషల్ మీడియా మానసికంగా మాత్రమే హాని చేస్తుందని మీరు అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. దాని భౌతిక దుష్ప్రభావాలు మానసిక ప్రభావాలతో సమానంగా భయంకరమైనవి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం వల్ల 46 హానికరమైన ప్రభావాలను సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కనుగొంది. సోషల్ మీడియాకు బానిసలుగా మారితే ఉద్యోగం, విద్యా సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది మరింత ఆర్ధిక రిస్క్ తీసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈ దుష్ప్రభావాలలో ఆందోళన, డిప్రెషన్, వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, సైబర్ స్టాకింగ్, నేరాలు, దురుద్దేశం, సమాచారం అధికంగా ఉండటంతో పాటు ఆన్‌లైన్ భద్రత లేకపోవడం వంటివి ఉన్నాయి.

సోషల్ మీడియా సమస్యలలో ఇప్పుడు మానసిక ఆరోగ్యం, ఉద్యోగం, విద్యా పనితీరుతో పాటు భద్రత,గోప్యత కూడా ఉన్నాయని యూనివర్సిటీ పరిశోధన పత్రం పేర్కొంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సోషల్ నెట్‌వర్క్‌లలో ఇప్పటివరకు చేసిన పరిశోధన, అధ్యయనం వాటి ప్రయోజనాలు సంభావ్యతపై మాత్రమే దృష్టి సారించాయి. అయితే, వీటికి అవాతలివైపు ఉన్న చీకటిని విస్మరించారు. ప్రస్తతం జరిగిన తాజా పరిశోధనలో విద్యావేత్తలు కూడా పాల్గొన్నారు.

పరిశోధకులు 2003 -2018 మధ్య సోషల్ మీడియాలో చేసిన 50 కి పైగా పరిశోధనలను సమీక్షించారు. 2003 లో సోషల్ మీడియా ప్రారంభ దశలో ఉంది. ఒక సంవత్సరం తరువాత ఫేస్ బుక్ (Facebook) ఉనికిలోకి వచ్చింది. అధ్యయనం ప్రధాన రచయిత లైలా బోరున్, గోప్యతా ఉల్లంఘనలు, మోసం, భయాందోళనలు, ఇతరులతో విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.

వాటిని ఎదుర్కోవటానికి మార్గాలను వెతుకుతున్నారు..

జర్నల్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో, నిపుణులు ఈ దుష్ప్రభావాలను ఆరు కేటగిరీలుగా విభజించారు. వీటిలో గోప్యతా ఆందోళనలు, భద్రతా బెదిరింపులు, పనితీరు క్షీణత, సామాజిక లావాదేవీల నష్టం, కలవరపెట్టే కంటెంట్, సైబర్ బెదిరింపు ఉన్నాయి. సమయం, శక్తి, డబ్బు వృధా సామాజిక లావాదేవీలలో నష్టాలతో ముడిపడి ఉంది. అదే సమయంలో, హింసాత్మక,అభ్యంతరకరమైన కంటెంట్ వినియోగదారుని మానసికంగా కలవరపెడుతుంది. పరిశోధకులు ఇప్పుడు ఈ దుష్ప్రభావాలను ఎదుర్కోవటానికి మార్గాలను వెతుకుతున్నారు.

ఈ పరిశోధనల్లో తేలిన విషయాలు సోషల్ మీడియా వినియోగంతో వచ్చే మానసిక నష్టాలకన్నా ఎక్కువగా భౌతికంగా వచ్చే సమస్యలు ఉంటాయని నిర్ధారిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం విషయంలో పరిమితి ఎవరికి వారు విధించుకోకపోతే.. ఇది భవిష్యత్తులో భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది.

Also Read: Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!

NIA: జమ్మూకాశ్మీర్‌లో వరుస హత్యలపై కేంద్రం సీరియస్ యాక్షన్.. రంగంలోకి ఎన్ఐఏ..

Click on your DTH Provider to Add TV9 Telugu