Foxconn Electric Car: ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు.. 750 కిలోమీటర్ల వరకు డోకా ఉండదు..

Foxconn Electric Car: ఆపిల్, ఇతర గ్లోబల్ బ్రాండ్‌ల మొబైల్స్‌ని సప్లై చేసే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు

Foxconn Electric Car: ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు.. 750 కిలోమీటర్ల వరకు డోకా ఉండదు..
Foxconn
Follow us
uppula Raju

|

Updated on: Oct 19, 2021 | 8:22 PM

Foxconn Electric Car: ఆపిల్, ఇతర గ్లోబల్ బ్రాండ్‌ల మొబైల్స్‌ని సప్లై చేసే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీల కోసం స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే కాంట్రాక్ట్ కింద EV లను తయారు చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ టెక్నాలజీ డే కార్యక్రమంలో కార్లను ఆవిష్కరిస్తూ ఛైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ.. చైనా, ఉత్తర అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాల సంస్థల కోసం ఫాక్స్‌కాన్ కార్లు, బస్సులను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు.

మార్కెట్‌కు అనుగుణంగా ఖాతాదారులు డిజైన్‌, ఫీచర్లను మార్చుకోవచ్చని సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లూ వెల్లడించారు. హాన్‌ హయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీగా సుపరిచిమైన ఫాక్స్‌కాన్‌.. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి కోసం పలు వాహన సంస్థలు, ప్రతిష్ఠాత్మక సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా అభివృద్ధి చేసిన ‘ఈ సెడాన్‌’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయిదు సీట్లు కలిగిన ‘మోడల్‌ ఈ’ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది.

ఫాక్స్‌కాన్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఇది వచ్చే ఏడాది రోడ్లపైకి రావచ్చు. తైవాన్ న్యూస్ ప్రకారం.. బస్సు గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. అంతేకాదు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై వరుస దాడులను ఖండించిన జనసేనాని.. ఏమన్నారంటే.!

Chandrababu Naidu: రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు.. సీఎం, డీజీపీ కలిసి దాడి చేయించారు.. చంద్రబాబు ఫైర్..

Benefits of Banana: రోజూ ఒక అరటిపండు తినండి.. గుండెపోటు నుంచి దూరంగా ఉండండి..

Chandrababu Press Meet: వైసీపీ ఆందోళనలపై చంద్రబాబు రియాక్షన్ లైవ్ వీడియో