Nasa: సౌర వ్యవస్థలో ‘చందమామ’… అద్భుత చిత్రాలు తీసిన జూనో అంతరిక్ష నౌక…. నాసా ఆశ్చర్యం !

అంతరిక్షంలో ఎవరూ ఊహించని 'ఘటన' ఇది ! చివరకు నాసా శాస్త్రజ్ఞులు కూడా అంచనా వేయలేకపోయిన విచిత్ర వాస్తవమిది !

Nasa: సౌర వ్యవస్థలో 'చందమామ'... అద్భుత చిత్రాలు తీసిన జూనో అంతరిక్ష నౌక.... నాసా ఆశ్చర్యం !
Biggest Moon
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 10, 2021 | 12:09 PM

అంతరిక్షంలో ఎవరూ ఊహించని ‘ఘటన’ ఇది ! చివరకు నాసా శాస్త్రజ్ఞులు కూడా అంచనా వేయలేకపోయిన విచిత్ర వాస్తవమిది ! సౌర వ్యవస్థలో అతి పెద్ద ‘చందమామ’ను జూనో అంతరిక్ష నౌక క్యాప్చర్ చేయగలిగింది. రెండు దశాబ్దాల కాలంలో ఈ హైరిసోల్యూషన్ తో కూడిన మూన్ ఇమేజిలను ఈ స్పేస్ క్రాఫ్ట్ మొదటిసారిగా తీసింది. ఈ మూన్ కి సంబంధించిన దాన్నే గేనీ మీడ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రహం లోని క్రేటర్స్ (గోతులు).. ఇతర పరిసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జూనో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ స్టాట్ బోల్తన్ తెలిపారు. జూపిటర్ ఆర్బిటర్ లోని జూనో కామ్ ఇమేజర్ నుంచి..స్టెల్లార్ రిఫరెన్స్ యూనిట్ స్టార్ కెమెరా నుంచి ఈ ఇమేజీలను అద్భుతంగా క్యాప్చర్ చేయగలిగిందని నాసా రీసెర్చర్లు అంటున్నారు. మూన్ లోని నల్లని, తెల్లని ఉపరితలంపైని విశేషాలను ఇది తీయగలిగింది. నీరు-ఐస్ తో కూడిన చంద్రునిలో మొత్తం భాగాన్ని ఈ అంతరిక్ష నౌక తన కెమెరాల్లో బంధించగలిగినట్టు వారు పేర్కొన్నారు. మరిన్ని ఇమేజీలను=శాస్త్రజ్ఞులు రిసీవ్ చేసుకుని ఐస్ తో కూడిన ‘వరల్డ్’ ని సృష్టించేందుకు వీటిని ఫిల్టర్ చేయనున్నారు. అంటే సౌర వ్యవస్థలోని చందమామలో గల ఐస్ ని విశ్లేషించనున్నారు. రానున్న రోజుల్లో ఈ అంతరిక్ష నౌక గేనీమీడ్ నుంచి మరిన్ని ఛాయాచిత్రాలను పంపుతుందని వీరు భావిస్తున్నారు.

సోలార్ సిస్టం లోని మూన్ భౌగోళిక, వాతావరణ పరిస్థితులను, రేడియేషన్ ఎన్విరాన్ మెంట్ తదితరాలను విశ్లేషించడంలో ఈ ఫోటోలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. జూపిటర్ చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న జూనో ..గేనీమీడ్ వాటర్ ఐస్ క్రస్ట్ లోకి చొచ్చుకు పోయిందని, అక్కడి డేటాను, టెంపరేచర్ ను సేకరించిందని రీసెర్చర్లు తెలిపారు. 2011 లో ఈ అంతరిక్ష నౌకను పయోగించగా 2016 లో గమ్యాన్ని చేరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Karthika Deepam: మోనిత నిజ స్వరూపం ఇప్పటికైనా నీకు తెలిసిందా అంటూ కార్తీక్ ని ప్రశ్నించిన సౌందర్య

Black Market of medicines : అత్యవసర ఇంజక్షన్లు కొని బ్లాక్ లో భారీ మొత్తానికి అమ్ముతోన్న హైదరాబాద్ యువకుడు అరెస్ట్