అసలు ఆక్సిజనే అవసరం లేని ప్రాణి ఇదే!

ఒక్క సెకను కూడా ఊపరి పీల్చుకోకుండా ఉండమంటేనే కష్టం. అలాంటిది అస్సలు ఆక్సిజన్ పీల్చుకోకుండా ఉండగలమా..! అందుకే చంద్రుడిపై కూడా ఆక్సిజన్ ఉందా..

  • Tv9 Telugu
  • Publish Date - 8:50 am, Fri, 28 February 20
అసలు ఆక్సిజనే అవసరం లేని ప్రాణి ఇదే!

ఒక్క సెకను కూడా ఊపరి పీల్చుకోకుండా ఉండమంటేనే కష్టం. అలాంటిది అస్సలు ఆక్సిజన్ పీల్చుకోకుండా ఉండగలమా..! అందుకే చంద్రుడిపై కూడా ఆక్సిజన్ ఉందా.. లేదా.. అని పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని జంతువులు ఆక్సిజన్ లేకుండా కొంతకాలం జీవిస్తాయి కానీ.. మొత్తానికే ఊపిరి తీసుకోకుండా ఉండవు. ఇది సైన్స్ చెప్పిన సత్యం. కానీ అది ఓ ప్రాణికి అవసరం లేదు. ఆక్సిజన్ లేకుండా ఉండగల ఒక ప్రాణిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తాజాగా ఇజ్రాయిల్ లెట్ అవీన్ యూనివర్శిటీ ఈ జీవిని కనిపెట్టింది.

దాని పేరు ‘హెన్నెగుయా సాల్మికోలా’. ఇది పరాన్న జీవి. దీనిలో కణాలు 10 కంటే తక్కువే ఉంటాయి. జీవించాలంటే కణాలకు శక్తి అవసరం. కణాలు పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. కానీ అది అవసరమే లేని జీవి.. ఇదని ఇజ్రాయిల్ లెట్ అవీన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది సముద్రం అడుగు భాగంలో ఉంటుందట. అయితే మరి దీని శరీరంలోకి శక్తి ఎక్కడినుంచి వస్తుంది అనేదానిపై కూడా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.