Reliance Jio Offer: ఏడాది పాటు మీకు ‘స్వాతంత్య్రం’.. జియో కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా.. అస్సలు మిస్ అవ్వొద్దు..
ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చే ఫ్రీడమ్ ప్లాన్ ను ఈసారి మరింత కొత్తగా ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద లాంగ్ టర్మ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ. 2,999లో ఏడాది కాల వ్యవధితో ఉండే ప్రీ పెయిడ్ ప్లాన్ ను మార్కెట్లో విడుదల చేసింది. కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్, కాంప్లమెంటరీ జియో యాప్స్ తో పాటుగా రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తున్నట్లు ప్రకటించింది.
రిలయన్స్ జియో.. మన దేశంలో పరిచయం అక్కరలేని పేరు. చవకైన ప్లాన్లకు పెట్టింది పేరైన జియో టెలికాం నెట్‌వర్క్ పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం ఇంటర్ నెట్ సుపరిచితం చేసేసింది. అంతేకాక కస్టమర్ల అవరాలకు అనుగుణంగా ఉత్తమ ప్లాన్లను తీసుకొస్తూ అంతకంతకూ తన వినియోగదారులను పెంచుకుంటోంది. ఇదే క్రమంలో మరో బాహుబలి ప్లాన్ తీసుకొచ్చింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చే ఫ్రీడమ్ ప్లాన్ ను ఈసారి మరింత కొత్తగా ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద లాంగ్ టర్మ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ. 2,999లో ఏడాది కాల వ్యవధితో ఉండే ప్రీ పెయిడ్ ప్లాన్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీనిని భారీ ఎత్తున ప్రయోజనాలతో నింపింది. కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్, కాంప్లమెంటరీ జియో యాప్స్ తో పాటుగా రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ కథనాన్ని మిస్ అవ్వకండి. ఈ ప్లాన్ కుసంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రూ. 2,999 ప్లాన్ వివరాలు ఇవి..
రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ధర రూ. 2,999గా ఉంది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, ప్రతి రోజూ 2.5జీబీ డేటా చొప్పున మొత్తం ఏడాదిలో 912జీబీ డేటా ప్రధాన ప్రయోజనాలుగా ఉన్నాయి. అంతేకాక ఈ ప్లాన్ కొనుగోలు చేసిన వారికి కాంప్లిమెంటరీగా జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటియాప్స్ కూడా ఏడాది పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ ఉంటుంది.
అదనపు ప్రయోజనాలు..
రూ. 2,999తో లాంగ్ టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసిన వారికి పలు కూపన్లు రూపంలో రూ. 5,800 విలువైన కూపన్లను కూడా జియో అందిస్తోంది. స్విగ్గీ, యాత్ర, అజియో, నెట్‌మెడ్స్, రిలయన్స్ డిజిటల్‌లో కొనుగోలుపై ఈ కూపన్లు వస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
- స్విగ్గీలో రూ. 240 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ. 100 డిస్కౌంట్ లభిస్తుంది.
- యాత్ర సాయంతో విమానాలు బుక్ చేసుకుంటే రూ. 1,500 డిస్కౌంట్, హోటళ్లలో రూ. నాలుగు వేల కంటే ఎక్కువ చెల్లిస్తే 15శాతం వరకూ రాయితీ లభిస్తుంది.
- అజియోలో రూ. 999 కొనుగోలుపై రూ. 200 తగ్గింపు ఉంటుంది.
- నెట్ మెడ్స్ లో రూ. 999 పెట్టి కొనుగోలు చేస్తే 20శాతం డిస్కౌంట్ సొంతమవుతుంది.
- రిలయన్స్ డిజిటల్‌లో కొన్ని సెలెక్టెడ్ ఆడియో గ్యాడ్జెట్లు, గృహోపకరాలపై 10శాతం తగ్గింపు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..