రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్.. సెప్టెంబర్ 2న లాంచ్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మరో లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 9A ని భారతమార్కెట్లోకి తీసుకొస్తోంది. మనదేశంలో సెప్టెంబర్ 2వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది.

రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్.. సెప్టెంబర్ 2న లాంచ్
Anil kumar poka

|

Aug 28, 2020 | 6:42 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మరో లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 9A ని భారతమార్కెట్లోకి తీసుకొస్తోంది. మనదేశంలో సెప్టెంబర్ 2వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే రెడ్ మీ 9 సీరిస్ లో 9ప్రైమ్, రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 9 సిరీస్ లో లాంచ్ అయ్యే మూడో ఫోన్ ఇది. దీనికి సంబంధించిన వర్చువల్ ఆన్ లైన్ ఈవెంట్ ను షియోమీ సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించనుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఈ ఫోన్ కు సంబంధించిన మొదటి సేల్ జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్ ధర ఎంత అన్నది ఇంకా పేర్కొన లేదు.

ఇప్పటికే మలేషియాలో లాంచ్ అయిన దీని ధర భారత రూపాయిల్లో సుమారు రూ.6,400 గా ఉంది. ఇందులో కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ చేశారు. అయితే మనదేశంలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లో వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగా పిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించబోతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu