Smartphone: ఆ ఫోన్ కోసం ఎగబడుతున్న జనాలు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.. వారంలోనే కొత్త రికార్డులు..
Realme 11 Pro Plus: రియల్ మీ గత వారం లాంచ్ చేసిన రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ ఫోన్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయి అమ్మకాలతో దుమ్మురేపుతోంది. ప్రారంభ సేల్లో ఏకంగా 200కే(రెండు లక్షల) ఫోన్లను విక్రయించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
రియల్ మీ గత వారం లాంచ్ చేసిన రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ ఫోన్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయి అమ్మకాలతో దుమ్మురేపుతోంది. ప్రారంభ సేల్లో ఏకంగా 200కే(రెండు లక్షల) ఫోన్లను విక్రయించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మేరకు రియల్ మీ ఇండియా సంస్థ తన ట్విటర్ పేజీలో అధికారికంగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ సంస్థ తరఫున గత రికార్డులన్నీ చేరిపేస్తూ సేల్స్ లో కొన్ని ఎత్తులకు వెళ్లిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ రియల్ మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్ లో ఏముంది? మార్కెట్లో దీనిపై ఎందుకింత క్రేజ్? దానిలోని ఫీచర్లు, స్పెక్స్ ఏంటి? చూద్దాం రండి..
? Huge thanks to all the #realme fans for this groundbreaking achievement! ?
ఇవి కూడా చదవండిWe’ve surpassed the first sales record of 200K, smashing all previous number series records! ? #realme11ProSeries5G #200MPzoomToTheNextLevel pic.twitter.com/EahACRItQZ
— realme (@realmeIndia) June 19, 2023
రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ స్పెక్స్..
ఈ ఫోన్ గత వారంలోనే విడుదలైంది. దీని ప్రారంభ ధర రూర. 27,999గా ఉంది. దీనిలో 200ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 11 వాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఫుల్ హెచ్ డీ ప్లస్ కర్వడ్ స్క్రీన్ ఉంటుంది. 360హెర్జ్ టచ్ శ్యాంప్లింగ్ రేట్ ఉంటుంది. రియల్ మీ యూఐ 4.0, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిలో ఆక్టా కోరో 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ఉంటుంది.
కెమెరాయే ప్రధాన ఆకర్షణ..
ఈ రియల్ మీ 11 ప్రో సిరీస్ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ దీనిలోని కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. దీనిలో 200 మెగా పిక్సల్స్ శామ్సంగ్ హెచ్ పీ3 మెయిన్ సెన్సార్.. సూపర్ ఓఐఎస్ కేపబులిటీతో ఉంటుంది. అలాగే 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సల్ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మధురమైన క్షణాలను మరింత అందంగా తీర్చిదిద్దుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..