Realme: ఎయిర్‌ గెశ్చర్‌ ఫీచర్‌తో రియల్‌ మీ కొత్త ఫోన్‌.. ఇంతకీ ఫీచర్‌ ఏంటంటే..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ నార్జో 70 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999కాగా, 256 జీబీ స్టోరేజ్‌ ధర...

Realme: ఎయిర్‌ గెశ్చర్‌ ఫీచర్‌తో రియల్‌ మీ కొత్త ఫోన్‌.. ఇంతకీ ఫీచర్‌ ఏంటంటే..
Realme Narzo 70 Pro
Follow us

|

Updated on: Mar 19, 2024 | 5:39 PM

మారుతోన్న టెక్నాలజీతో పాటు స్మార్ట్ ఫోన్‌లు కూడా మారుతూ వస్తున్నాయి. రోజుకో కొత్త టెక్నాలజీతో ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ నార్జో 70 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎయిర్‌ గెశ్చర్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇంతకీ ఫీచర్ల ప్రత్యేకత ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ నార్జో 70 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999కాగా, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా నిర్ణయించారు. మార్చి 22 నుంచి అమెజాన్‌, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి రానుంది సేల్ భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ అందించనున్నారు. ఈ సేల్‌లో రియల్‌మీ టీ300 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను ఉచితంగా పొందొచ్చు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఎయిర్‌ గెశ్చర్స్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో ఫోన్‌ను టచ్‌ చేయకుండానే స్క్రీన్‌ షాట్‌ తీయడం, ఇన్‌స్టా రీల్స్‌ పైకి మూవ్‌ చేయడం వంటి 10 రకాల గెశ్చర్స్‌ను చేయొచ్చు. అలాగే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌తో తడి చేత్తోనూ ఫోన్‌ డిస్‌ప్లేను ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఇక ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వర్చువల్‌గా మరో 8జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 67 వాట్స్‌ సూపర్ వూక్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..