Airtel Offers: ఎయిర్‌టెల్ యూజర్లకు హోలీ బంపర్ ఆఫర్… అన్‌లిమిటెడ్ 5జీ డేటా మీ సొంతం
ప్రస్తుతం హోలీ పండుగ సందర్భంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌టెల్ కొత్త హోలీ ఆఫర్‌లో ఉచిత అన్‌లిమిటెడ్ 5 జీ డేటాను అందిస్తుంది. రూ. 239, అంతకంటే ఎక్కువ ధర కలిగిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు, ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లందరూ ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ హోలీ ఆఫర్ పరిచయ ఆఫర్‌లో భాగంగా ఉచిత అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది.
200 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్, నెట్‌వర్క్ నాణ్యత, వినూత్న సేవలు, ఆకర్షణీయమైన ఆఫర్‌లకు ప్రసిద్ధి చెందింది. ఎయిర్‌టెల్ అత్యంత ప్రజాదరణ పొందిన టెలికమ్యూనికేషన్ సేవల్లో ఒకటి. అయితే ప్రస్తుతం హోలీ పండుగ సందర్భంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌టెల్ కొత్త హోలీ ఆఫర్‌లో ఉచిత అన్‌లిమిటెడ్ 5 జీ డేటాను అందిస్తుంది. రూ. 239, అంతకంటే ఎక్కువ ధర కలిగిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు, ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లందరూ ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ హోలీ ఆఫర్ పరిచయ ఆఫర్‌లో భాగంగా ఉచిత అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ని ఉపయోగించి 5జీ సపోర్ట్ చేసే ఫోన్లు ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లంతా ఈ 5 జీ సేవలను ఉపయోగించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్‌తో పాటు ప్రీపెయిడ్ వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌లో ఉచిత డేటాను పొందవచ్చు. అయితే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్‌లు ఈ ఆఫర్‌కు అర్హత పొందాలంటే రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ధరతో అపరిమిత ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి. రూ. 455, రూ. 1799 వంటి నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్యాక్‌లు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాలకు అనర్హులని వినియోగదారులు గమనించాలని ఎయిర్‌టెల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఆఫర్లతో వినియోగదారులు డేటా క్యాప్‌ల గురించి ఆందోళన చెందకుండా 5 జీ ప్లస్ సేవలను ఆశ్వాదించవచ్చు.
5జీ డేటా పొందడ ఇలా
- మీరు ఎయిర్‌టెల్ యాక్టివ్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. దాని ధర నెలకు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకోవాలి.
- ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మై ఎయిర్‌టెల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి యాప్‌ని తెరిచి, మీ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయాలి.
- స్ట్రీమింగ్, డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేయడం కోసం ఉచిత అపరిమిత 5జీ డేటాను యాక్సెస్ చేయడం ప్రారంభించడానికి యాప్‌లోని “అపరిమిత 5జీ డేటా” అని ఉన్న బ్యానర్‌పై క్లిక్ చేయాలి.
- మీరు ఆఫర్‌ను క్లెయిమ్ చేసిన తర్వాత మీరు ఎయిర్‌టెల్‌కు సంబంధించిన నెట్‌వర్క్ ప్రాంతాల్లో మీ స్మార్ట్‌ఫోన్‌లో అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించవచ్చు.
- ఎయిర్‌టెల్ 5 జీ ప్లస్ సేవ భారతదేశంలోని 270కి పైగా నగరాల్లో అందుబాటులో ఉండగా ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఆఫర్‌ను క్లెయిమ్ చేయడానికి 5జీ అనుకూల పరికరంతో పాటు 5జీ నెట్‌వర్క్ ప్రాంతంలో ఉండాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి