Realme GT Neo 3: 150W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో మార్కెట్లో విడుదలైన రియల్‌మీ జీటీ 3

Realme GT Neo 3: ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ జీటీ నియో 3..

Realme GT Neo 3: 150W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో మార్కెట్లో విడుదలైన రియల్‌మీ జీటీ 3
Realme Gt Neo 3
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2022 | 11:37 AM

Realme GT Neo 3: ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ జీటీ నియో 3 (Realme GT Neo 3) పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌లో మార్చి 22న మార్కెట్లో విడుదలైంది. తొలుత చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా Realme GT Neo 3 నిలుస్తుందని కంపెనీ వెల్లడించింది. 150 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సరిపోర్టు చేయడం దీని ప్రత్యేకత. కేవలం 5 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ చేయనుంది ఈ ఫోన్‌.

అయితే గత సంవత్సరం చైనా దిగ్గజం షావోమీ 120 W ఛార్జింగ్‌ సపోర్టుతో Xiaomi 11i హైపర్‌ ఛార్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌ మీ తన జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది. థర్మల్‌ మేనెజ్‌మెంట్‌ కోసం డైమండ్‌ ఐస్‌ కోర్‌ కూలింగ్‌ ప్లస్‌ ఫీచర్‌ను జోడించింది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర విషయానికొస్తే.. ఇందులో రెండు రకాల బ్యాటరీ సామర్థ్యాలతో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 150W ఫాస్ట్‌ఛార్జింగ్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యం 4,500mAh ఉంది. ఇక 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉండనుంది. ఈ ఫోన్‌లలో గరిష్టంగా 12GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తోంది.

రియల్‌మీ జీటీ నియో 3 ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. సోనీ IMX766 సెన్సార్​ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకగా చెబుతున్నారు.ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.5 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ఫోన్‌కు డాల్బీ ఆట్మోస్‌ స్పీకర్‌ను అందిస్తోంది కంపెనీ రెండు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్‌ ధర వరుసగా దాదాపు రూ.24,000, రూ.27,500, రూ.31,200గా ఉంది. ఇందులో 6GB ర్యామ్‌+128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌+256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ +256GB ఇంటర్నల్‌ స్టోరేజీతో వస్తోంది.

ఇవి కూడా చదవండి:

Google: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం Google నుండి కొత్త ఫీచర్

Google Chrome, Microsoft: మీరు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్ వాడుతున్నారా..? అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్