Nano Banana AI: ఈ ప్రాంప్ట్స్‌తో… వింటేజ్ హీరోలా మారిపోతారు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జెమినీ“నానో బనానా” రెట్రో ట్రెండ్ ఫొటోలే కనిపిస్తున్నాయి. నిన్నటి వరకూ అమ్మాయిలు రెట్రో శారీ లుక్ తో అదరగొట్టారు. ఇప్పుడు మగవాళ్లు కూడా ఈ ట్రెండ్ ను రీక్రియేట్ చేస్తున్నారు. మరి మీరూ ట్రై చేస్తారా?

గత వారం నుంచి ఇన్ స్టాగ్రామ్ అంతా 1990ల నాటి బాలీవుడ్ స్టైల్ ఫొటోలతో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ ట్రెండ్ ను బాగా వైరల్ చేశారు. అయితే ఇప్పుడు వింటేజ్ బాలీవుడ్ మాఫియా లుక్స్ లో మగవాళ్లూ అదరగొడుతున్నారు. ఈ వింటేజ్ ట్రెండ్ లో మీరూ జాయిన్ అవ్వాలంటే ఈ ప్రాంప్ట్స్ ట్రై చేసి లుక్స్ రీక్రియేట్ చేయండి..
స్టైలిష్ టీచర్ లుక్
జెమినీ ఏఐ యాప్ లోకి వెళ్లి.. బనానా ఏఐ మోడల్ ను ఎంచుకుని అక్కడ మీ ఫొటో అప్ లోడ్ చేయండి. కింద “Transform the photo into a vintage cinematic look. leaning casually against a wooden desk, dressed in a light coloured shirt with the sleeves rolled up, grey tailored trousers, and a dark brown belt.’’ అని టైప్ చేయండి. అంతే.. వింటేజ్ స్టైల్ లో ఉన్న టీచర్ లుక్ మీ సొంతం.
బాలీవుడ్ మాఫియా లుక్
ఏఐ చాట్ లో మీ ఫొటో అప్ లోడ్ చేసి కింద “ convert this image into 1970 -inspired Bollywood frame, a man seated confidently on the hood of a vintage car. styled in a striped blazer over matching bell bottom trousers” అని టైప్ చేయండి. కొన్ని సెకన్లు ఆగాక మీ ఫొటో వింటేజ్ బాలీవుడ్ మాఫియా డాన్ లాగా మారిపోతుంది. ప్రస్తుతం ఇదే బాగా ట్రెండ్ అవుతున్న స్టైల్.
వింటేజ్ బ్లాక్ అండ్ వైట్ స్టైల్
మీకు ఇంకా పాత స్టైల్ లుక్ కావాలంటే.. మీ ఫొటో అప్ లోడ్ చేశాక “ convert this image to a striking 1960’s monochrome portrait, with tousled hair, a beard, and a piercing gaze” అని టైప్ చేయండి. వింటేజ్ డ్రెస్సింగ్ తో పాటు హెయిర్ స్టైల్ కూడా మారిపోతుంది.
రాయల్ కింగ్ లుక్
మీరు ఇంకా క్రియేటివ్ గా ట్రై చేయాలి అనుకుంటే.. “convert this image as a royal king for an Indian dynasty with sword in hand and walking towards camera” అని ఎంటర్ చేస్తే.. మీరు రాజులా మారిపోతారు. చేతిలో ఖడ్గం పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఇమేజ్ వస్తుంది.
ఇలా కూడా..
ఇవి మాత్రమే కాదు. “convert this image into 1970 -inspired vintage look” అని టైప్ చేసిన తర్వాత పక్కన మీకు నచ్చిన లొకేషన్, ఇతర డీటెయిల్స్ ఇవ్వొచ్చు. ఉదాహరణకు “in Mumbai background” లేదా “leaning on a old motorcycle” లేదా “like rocky bhai in KGF “ఇలా.. మీకు తోచినట్టుగా ప్రాంప్ట్ ఇవ్వొచ్చు. ఇమేజ్ జనరేట్ అయ్యాక మార్పులు చేయమని కూడా ఏఐని అడగొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేసి చూడండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




