AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Scam: గూగుల్ రివ్యూస్ పేరుతో కొత్త మోసం.. ఇలా చేస్తే సేఫ్!

రోజుకో రకమైన మోసాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా గూగుల్ రేటింగ్స్ పేరుతో కొత్త రకం స్కామ్ కు స్కెచ్ వేశారు. ఇందులో చిక్కుకున్నారంటే ఇక అంతే సంగతి.. అసలేంటి స్కామ్? సేఫ్ గా ఎలా ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Cyber Scam: గూగుల్ రివ్యూస్ పేరుతో కొత్త మోసం.. ఇలా చేస్తే సేఫ్!
Google Reviews Scam
Nikhil
|

Updated on: Sep 17, 2025 | 4:59 PM

Share

ఏదైనా షాపు లేదా హోటల్ కు వెళ్లే ముందు చాలామంది గూగుల్ లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూస్తుంటారు. ఇది చాలా కామన్. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొత్తరకమైన మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మా షాపు లేదా హోటల్ గురించి మంచి రివ్యూ ఇస్తే.. మీకు క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ వోచర్లు లేదా డిస్కౌంట్లు లభిస్తాయని స్కామర్లు మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. రివ్యూలు అడగడం కామన్ కదా.. అనుకుని వారు చెప్పింది చేశారంటే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ. అసలు స్కామ్ ఎలా జరుగుతుందంటే..

మోసం ఎలా జరుగుతుంది?

  • ముందుగా స్కామర్లు గూగుల్ ప్రతినిధులుగా లేదా షాపు ఓనర్లుగా నటిస్తూ కాల్ లేదా టెక్స్ట్ చేస్తారు.
  • షాపు/రెస్టారెంట్ కు రివ్యూ ఇవ్వడం ద్వారా మీరు క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ వోచర్ లేదా డిస్కౌంట్ పొందుతారు అని చెప్తారు.
  • ఒకవేళ మీరు ఒప్పుకుంటే మేము పంపిన లింక్ పై క్లిక్ చేసి మంచి రేటింగ్ ఇవ్వండి అని ఒక లింక్ పంపిస్తారు.
  • మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే.. ఒక థర్డ్ పార్టీ యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. తర్వాత అది మీ లాగిన్ డీటెయిల్స్ ను చోరీ చేసి హ్యాకర్స్ కు వివరాలు పంపుతుంది.

జాగ్రత్తలు ఇలా..

ఏదైనా కంపెనీ మిమ్మల్ని రివ్యూ ఇవ్వండి.. బదులుగా డబ్బు లేదా బహుమతులు ఇస్తాం అని చెప్తే అది ఫేక్ అని గుర్తించాలి. తెలియని లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. అలాగే తర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేయొద్దు. ఒకవేళ షాపు ఓనర్లు నిజంగా అడిగినట్టు మీకు అనిపిస్తే.. గూగుల్ సెర్చ్ లేదా మ్యాప్స్ లో ఆ షాపు వివరాలు చెక్ చేసుకుని కావాలంటే అక్కడ రివ్యూ ఇవొచ్చు. అంతేకానీ రేటింగ్ ఇవ్వడానికి లింక్ లు ఓపెన్ చేయాల్సిన పని లేదు.

మోసపోతే ఏం చేయాలి?

ఒక వేళ మీరు ఏదైనా సైబర్ మోసానికి గురైతే.. మీ డబ్బుని తిరిగి పొందడానికి వెంటనే.. బ్యాంక్ లేదా యూపీఐ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in)లో లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. కాల్ రికార్డింగ్‌లు, స్క్రీన్‌షాట్‌లు వంటివి సేవ్ చేసి ఉంచుకోండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెరుగులో ఉప్పు బెటరా? లేదా చక్కెరా? ఎలా తీసుకుంటే ప్రయోజనం
పెరుగులో ఉప్పు బెటరా? లేదా చక్కెరా? ఎలా తీసుకుంటే ప్రయోజనం
నానమ్మల కాలంనటి ఈ రైస్ తింటే మెతుకు కూడా మిగల్చరు!
నానమ్మల కాలంనటి ఈ రైస్ తింటే మెతుకు కూడా మిగల్చరు!
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ 10 ట్రిక్స్ ఫాలో అవ్వండి
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ 10 ట్రిక్స్ ఫాలో అవ్వండి
టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. . పూర్తి లెక్కలివే..!
టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. . పూర్తి లెక్కలివే..!
ఈ స్పెషల్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్‌తో మీ ఉదయాన్ని ఎంతో హుషారుగా షురూ
ఈ స్పెషల్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్‌తో మీ ఉదయాన్ని ఎంతో హుషారుగా షురూ
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ తప్పనిసరి! లేదంటే తప్పదు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీ తప్పనిసరి! లేదంటే తప్పదు?
ఉదయం పూట నీరు తాగి మీ రోజును ప్రారంభిస్తే ఆ రోగాలన్నీ మాయం..
ఉదయం పూట నీరు తాగి మీ రోజును ప్రారంభిస్తే ఆ రోగాలన్నీ మాయం..
నిద్రపోతున్నప్పుడు పాదాలు తలుపు వైపు ఉంటే అశుభమా? వాస్తు హెచ్చరిక
నిద్రపోతున్నప్పుడు పాదాలు తలుపు వైపు ఉంటే అశుభమా? వాస్తు హెచ్చరిక
పోషకాల గని మునగాకుతో అదిరిపోయే టేస్టీ చట్నీ..అమృతం లాంటి రెసిపీ
పోషకాల గని మునగాకుతో అదిరిపోయే టేస్టీ చట్నీ..అమృతం లాంటి రెసిపీ
మెకానిక్ అవసరమే లేదు.. ఫ్రిజ్‌లో నుంచి నీరు కారే సమస్యకు చెక్
మెకానిక్ అవసరమే లేదు.. ఫ్రిజ్‌లో నుంచి నీరు కారే సమస్యకు చెక్