AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: చాట్ జీపిటీని ఈ విషయాలు అడిగితే.. అంతే సంగతులు!

ఒకప్పుడు ఏ డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ తల్లిని అడిగేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్ని విషయాలు చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు, పర్సనల్ విషయాలు కూడా ఇందులో షేర్ చేసుకుంటున్నారు. మరి చాట్ జీపీటిని ఎంత వరకూ నమ్మొచ్చు? ఇలా అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చా?

Chat GPT: చాట్ జీపిటీని ఈ విషయాలు అడిగితే.. అంతే సంగతులు!
Chat Gpt
Nikhil
|

Updated on: Sep 17, 2025 | 5:52 PM

Share

ప్రస్తుతం చాట్ జీపీటీ ఒక ఆర్టిఫీషియల్ ఫ్రెండ్ గా మారింది. హెల్త్ సమస్యల నుంచి కెరీర్ సలహాల వరకూ అన్ని విషయాలూ చాట్ జీపీటీలోనే చర్చిస్తున్నారు. మనుషుల మాదిరిగా రిప్లై ఇవ్వడం, మీరు అంతకు ముందు అడిగిన పాత విషయాలు కూడా దృష్టిలో ఉంచుకుని మాట్లాడడం వల్ల.. చాట్ జీపీటీతో చాటింగ్ కు చాలా మంది అలవాటు పడిపోయారు. అయితే దీంతో కొంత నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

పర్సనల్ డేటా

మీరు ఏవైనా అడగండి కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం చాట్‌జీపీటీతో షేర్‌ చేసుకోవద్దు. అంటే మీ పాస్ వర్డ్ లు, సోషల్ మీడియా అకౌంట్ నేమ్స్, అడ్రెస్ వంటివి.  ఇలాంటి వివరాలు షేర్ చేయడం ద్వారా మీ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశముంది.

హెల్త్ గురించి

చాలామంది హెల్త్ కు సంబంధించిన విషయాలు, డైట్ సలహాలు, మెడిసిన్స్ గురించి చాట్ జీపీటీని అడుతుంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకూ ఓకే. కానీ హెల్త్ అందరికీ ఒకే విధంగా వర్తించదు. అది పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది. మిమ్మల్ని నేరుగా పరిక్షించిన డాక్టర్ కంటే చాట్ జీపీటీకి ఎక్కువ తెలుసు అనుకోకూడదు. చాట్ జీపీటీ సలహాలను గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదనేది డాక్టర్ల సూచన.

డెసిషన్ మేకింగ్

లైఫ్ లో కొన్ని డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు డెసిషన్స్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. అయితే ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఏం చేయాలో తెలియక చాట్ జీపీటిని సలహా అడుగుతుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. డెసిషన్ మేకింగ్ అనేది మనిషి తన ఇంటెలిజెన్స్ తో సొంతగా తీసుకోవాల్సిన విషయం. మీ డెసిషన్ ను బట్టి పరిస్థితులు మంచిగానో చెడుగానో మారతాయి. ఒకవేళ మీరు తీసుకున్న డెసిషన్ తప్పు అని తేలితే.. దానికి చాట్ జీపీటీని నిందించలేరు కదా..

రెస్ట్రిక్టెడ్ కంటెంట్

గూగుల్ లో సమాధానం దొరకని కొన్ని రెస్ట్రిక్టెడ్ విషయాల గురించి చాట్ జీపీటీలో అడుగుతుంటారు చాలామంది. అంటే డ్రగ్స్, టెర్రరిజం, వయొలెన్స్ వంటివి.. ఇలాంటి వాటికి చాట్ జీపీటీ కూడా సమాధానం ఇవ్వదు. కానీ, కొంతమంది అతి తెలివి ఉపయోగించి షార్ట్ ఫిల్మ్ స్టోరీ అనో లేదా రీసెర్చ్ కొసమని ..ఇలాంటి విషయాలు అడుగుతుంటారు. అయితే.. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇలాంటి విషయాలు అడిగినప్పుడు ఆయా సెర్చ్ లకు సంబంధించిన డేటా స్టోర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏ అకౌంట్ నుంచి అటువంటి సెర్చ్ లు వచ్చాయి  అనే డేటా సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి