Poco X5 Pro: పోకో నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే..
భారత్‌లో కొత్త కొత్త మొబైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక దేశంలో పోకో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు తగ్గుతున్నాయి. ఈ రోజులలో..
భారత్‌లో కొత్త కొత్త మొబైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక దేశంలో పోకో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు తగ్గుతున్నాయి. ఈ రోజులలో మార్కెట్లో అనేక మొబైల్ బ్రాండ్లు పుట్టుకొచ్చినందున సాధారణ ఫీచర్లు ఉన్న ఫోన్‌లకు డిమాండ్ లేదు. కొన్ని నెలలుగా వేచిచూసిన పోకో ఇప్పుడు దేశంలో ఆకర్షణీయమైన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పోకో నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Poco X5 ప్రోని విడుదల చేసింది. ఎన్నో ఫీచర్లతో కూడిన ఈ మొబైల్ కెమెరా టెక్ ప్రియులను షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటి?, ధర ఎంత? ఏమిటో చూద్దాం.
ధర ఎంత?:
Poco X5 Pro ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో దేశంలో లాంచ్ అయింది. 6జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ మెమోరితో ఉంది. దీని ధర రూ.22,999. ఉంది. ఇక 8జీబీ ర్యామ్+ 256జీబీ ఎంపిక కోసం రూ.24,999. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ ఫిబ్రవరి 13 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఫీచర్స్ ఏమిటి?
Poco X5 Pro స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది.120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్. ఇందులోని డాల్బీ వెర్షన్ 10 బిట్ సపోర్ట్ పొందింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా అందించింది కంపెనీ. Qualcomm Snapdragon 778G SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్‌ను రన్ చేస్తుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 108 మెగాపిక్సెల్ కెమెరాతో చాలా తక్కువ స్మార్ట్‌ఫోన్‌ల వరుసకు ఇది కూడా అదనం. అలాగే, రెండవ కెమెరాలో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు మూడవ కెమెరా 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కాకుండా, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ఉంటుంది. దీనికి 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్‌లో 5G సపోర్ట్, హాట్‌స్పాట్, Wi-Fi, బ్లూటూత్, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి