స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటిస్తే తక్కువ ధరకే కొనేయొచ్చు.. అదెలా?

Smartphone Buying Tips: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ప్లాన్లో ఉన్నారా? మంచి స్మార్ట్ ఫోన్, తక్కువ ధరలకే కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథకం మీ కోసమే. డిస్కౌండ్ ధరలో స్మార్ట్ ఫోన్ దక్కించుకునే టిప్స్ మీ కోసం అందిస్తున్నాం. వాస్తవానికి కంపెనీలు, లేదా వెబ్ సైట్లు, వెండర్లు డిస్కౌంట్లు అందిస్తేనే మనం తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వీలుంటుంది.

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటిస్తే తక్కువ ధరకే కొనేయొచ్చు.. అదెలా?
Smartphone
Follow us
Madhu

|

Updated on: Mar 05, 2024 | 7:23 AM

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ప్లాన్లో ఉన్నారా? మంచి స్మార్ట్ ఫోన్, తక్కువ ధరలకే కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథకం మీ కోసమే. డిస్కౌండ్ ధరలో స్మార్ట్ ఫోన్ దక్కించుకునే టిప్స్ మీ కోసం అందిస్తున్నాం. వాస్తవానికి కంపెనీలు, లేదా వెబ్ సైట్లు, వెండర్లు డిస్కౌంట్లు అందిస్తేనే మనం తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వీలుంటుంది. అయితే ఏ ప్లాట్ ఫారంలో ఆఫర్లు ఉన్నాయి? ఏ కంపెనీ తక్కువ ధరలకు అందిస్తున్నాయి? వెతకడం, తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం రండి..

రీసెర్చ్ చేయడం.. ధరను సరిపోల్చడం..

ఏ స్మార్ట్ ఫోన్ పై ఏ ఆఫర్లు ఉన్నాయి. ఏ ప్లాట్ ఫారంలో అధిక ఆఫర్లు ఉన్నాయి. ఏ కంపెనీ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి వంటి వివరాలు తెలుసుకోవాలి. అందుకోసం కొన్ని ప్రత్యేకమైన వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. ప్రైస్ గ్రాబర్, కేమెల్ కేమెల్ కేమెల్, గూగుల్ షాపింగ్ వంటి వెబ్ సైట్లను వినియోగించి ధరలను సరిపోల్చవచ్చు.

సేల్ ఈవెంట్స్ కోసం వేచి ఉండండి..

సాధారణంగా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో పలు కంపెనీలు, ఆన్ లైన్ ప్లాట్ ఫారాలు, ఆఫ్ లైన్ స్టోర్లు కూడా ప్రత్యేక ధరలను ప్రకటిస్తాయి. పలు ఆఫర్లు అందిస్తాయి. ఉదాహరణకు ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు నిర్వహించే రిపబ్లిక్ డే సేల్, బిగ్ బిలియన్ డేస్, సైబర్ మండే, అమెజాన్ ప్రైమ్ డే వంటి ప్రత్యేక సేల్స్ ఎప్పుడు వస్తాయో చూసుకొని అప్పుడే కొనుగోలు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

కూపన్స్, ప్రోమో కోడ్స్..

మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు కూపన్స్, ప్రోమో కోడ్స్ వంటివి వినియోగించుకోవాలి. పలు రిటైలర్ వెబ్ సైట్లు, కూపన్ సైట్స్ ఇలాంటివి అందిస్తాయి. అలాగే ప్రమోషనల్ ఈ-మెయిల్స్ లను కూడా తనిఖీ చేస్తూ ఉంటే వాటిల్లో కూడా ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తాయి.

బేరం ఆడాలి.. ఏదైనా స్మార్ట్ ఫోన్ స్టోర్ కి వెళ్లి కొనుగోలు చేస్తుంటే.. మీరు కొనుగోలు చేసే రిటైలర్ తో బేరం ఆడాలి. అలాగే ఏమైనా ప్రమోషనల్ ఆఫర్లు ఉన్నాయేమో అడగాలి. అవకాశం ఉన్నంత వరకూ సేవ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.

రివార్డ్ ప్రోగ్రామ్స్.. రిటైలర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ లో ఎన్ రోల్ అవ్వాలి. తద్వారా డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్, లాయల్టీ పాయింట్స్ వంటి వాటిని వినియోగించుకోవాలి. వీటి ద్వారా మీ కొత్త ఫోన్ ధర తగ్గే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ కార్డు ఆఫర్లు.. పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు, ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్లాట్ ఫారంలు క్రెడిట్ కార్డులపై పలు ఆఫర్లను అందిస్తాయి. 10శాతం డైరెక్ట్ క్యాష్ బ్యాక్ ను అందిస్తాయి. వాటిని వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడు స్మార్ట్ ఫోన్ ధర గణనీయంగా తగ్గే వీలుంటుంది.

ఎక్స్ చేంజ్.. ఆపరేషన్లోనే ఉన్న మీ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయడం ద్వారా మంచి బోనస్ పొందొచ్చు. ఎలాగూ కొత్త ఫోన్ కొంటున్నారు కాబట్టి పాత ఫోన్ ఇవ్వడం ద్వారా పెద్ద మార్జిన్ లో తగ్గింపు పొందే వీలుంటుంది. కొత్త ఫోన్ ధరలో దానిని తగ్గించి కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..