Best Electric Bicycles: మంచి ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే టాప్ 5 మోడల్స్ మీ కోసం..!!
Electric Cycles: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు బైకులు స్కూటర్లు సందడి చేస్తున్నాయి.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు బైకులు స్కూటర్లు సందడి చేస్తున్నాయి. వీటికి తోడుగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా మార్కెట్లోకి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ సైకిళ్ళు రెండు రకాలుగా ఉపయోగపడతాయి మాన్యువల్ గా అయితే ఎలక్ట్రిక్ సైకిల్ ను మామూలుగా తొక్కుతూ ఎంత దూరమైనా వెళ్లే అవకాశం ఉంది. అదే ఎలక్ట్రిక్ మోడ్ లోకి వెళ్ళినట్లయితే చార్జింగ్ ను బట్టి, బ్యాటరీ సామర్థ్యం బట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్ తరహాలోనే ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా వెళుతుంటాయి. అయితే మార్కెట్లో హీరో లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేశాయి. అయితే మార్కెట్లోని టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్ గురించి తెలుసుకుందాము.
SVITCH Fat Electric Bike For Unisex (ధర: రూ. 96,950)
ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆటో మా పురుషులకు స్త్రీలకు ఇద్దరికీ సరిపోయేలా ఉంటుంది. డిజైన్ పరంగా చూసినట్లయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ సైకిల్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఇతర సైకిళ్లతో పోల్చి ఉన్నట్లయితే హై ఎండ్ సైకిల్ అని చెప్పాలి దీని ధర కూడా సుమారు 96,000 వరకు ఉంది. అలాగే సైకిల్ తయారీలో వాడినటువంటి మెటల్ చాలా తేలికైనది, ఎటువంటి రోడ్డు ఉన్నప్పటికీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను ఈజీగా తొక్కవచ్చు.
Hero Lectro C5E 27.5 SS Electric Cycle (ధర: రూ. 28,599)
ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ సైకిల్ ఏదైనా ఉందంటే అది హీరో లెక్ట్రో అని చెప్పాలి. ఈ సైకిల్ అందుబాటు ధరలో ఉంది. హీరో లెక్ట్రో సైకిల్ కు ప్రస్తుతం మార్కెట్లో చక్కటి స్పందన లభిస్తోంది.




Urban Terrain UT6000 Series MTB Cycle (ధర: రూ. 13,999)
ఒకప్పుడు మార్కెట్లో కంపెనీ MTB సైకిల్ లకు మంచి డి మాండ్ ఉండేది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కూడా MTB కంపెనీ ఎలక్ట్రిక్ సైకిల్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి వీటిని కొనుగోలు చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా టీనేజర్లు పిల్లలు సైతం ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లను తొక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Geekay Hashtag Electric Bicycle (ధర: రూ. 28,499)
డిజైన్ పరంగా చూసినట్లయితే జీకే కంపెనీకి చెందినటువంటి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ చాలా మంచి ఆదరణ అందుకుంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం సైకిల్ తొక్కే వారికి ఇది ఒక చక్కటి డిజైన్తో కూడిన సైకిల్ అనే చెప్పాలి. అలాగే స్వల్ప దూరాలు వెళ్లేందుకు ఇది ఎలక్ట్రిక్ సైకిల్ గా మారి మంచి మైలేజీని కూడా అందిస్తోంది దీని ధర కూడా అందుబాటులోనే ఉంది.
Ninety One Enigma R7 Hybrid 7 Speed Camouflage Electric Cycle ధర: రూ. 32,999
ఎనిగ్మా కంపెనీకి చెందినటువంటి ఎలక్ట్రిక్ సైకిల్ చక్కటి సేల్స్ అందుకుంటోంది ముఖ్యంగా ఆఫ్ రోడింగ్ రైడ్లకు ఈ సైకిల్ చక్కటి ఆప్షన్ అనే చెప్పాలి.
మరిన్ని టెక్నాలజీ కథనాలు చదవండి..