Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones: భారత్‎కు Nokia X30 5G వచ్చేసింది.. ధర, కెమెరా ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

హెచ్ఎండి గ్లోబల్ నోకియా భారతీయ యూజర్ల కోసం స్మార్ట్‌ఫోన్ నోకియా X30 5G అనే సరికొత్త ఫ్లాగ్‎షిప్‎ను ఆవిష్కరించింది.

Smartphones: భారత్‎కు Nokia X30 5G వచ్చేసింది.. ధర, కెమెరా ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
Nokia X30 5g
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 16, 2023 | 3:19 PM

ప్రముఖ స్మార్ట్‎ఫోన్ కంపెనీ నోకియా బ్రాండ్ లైసెన్సీ HMD గ్లోబల్ భారత యూజర్ల కోసం సరికొత్త నోకియా X30 5G అనే సరికొత్త ఫ్లాగ్‎షిప్ స్మార్ట్‎ఫోన్‎ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‎ఫోన్ డ్యూయర్ రియర్ కెమెరా సిస్టమ్ తో పాటుగా పలు ఆసక్తికరమైన కెమెరాలతో అద్బుతమైన డిజైన్‎తో యూజర్లను ఆకట్టుకుంటోంది. భారత మార్కెట్లో నోకియా ఫోన్ ధర రూ. 48,999నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ధర మారే ఛాన్స్ ఉంది. నోకియా ఎక్స్ 30 5జీ 50మెగాపిక్సెల్ ప్యూర్ వ్యూ కెమెరా ఈ ఫోన్‎లో ఉంటుంది. 13మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఏఐ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని ఉపయోగిస్తుంది. ఈ స్మార్ట్‎ఫోన్ పలు కెమెరాల కెపాసిటిని కూడా కలిగి ఉంది.

నైట్ మోడ్ 2.0, డార్క్ విజన్, ట్రైపాడ్ మోడ్, నైట్ సెల్ఫీలను కూడా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్‎తో 16మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉది. ఈ స్మార్ట్‎ఫోన్ లో గోప్రో క్విక్ యూప్ ప్రీఇన్‎స్టాల్ అయి వస్తుంది. నోకియా యూజర్లు ఎక్కడి నుంచైనా ఫొటోలను తీసుకోవచ్చు.

నోకియా X30 5G స్పెసిఫికేషన్స్:

– 6.43-అంగుళాల (1080 x 2400 పిక్సెల్‌లు) పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ (టైప్.) 700 నిట్స్ (పీక్) బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

– అడ్రెనో 619L జీపీయూతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ (2.2GHz x 2+1.8GHz x 6 Kryo 560 CPUలు)

-8జీబీ LPDDR4x ర్యామ్, 256జీబీ (UFS 2.2) స్టోరేజీతో వస్తుంది.

– ఇందులో డ్యూయల్ సిమ్ (నానో + నానో) ఆప్షన్ ఉంటుంది.

– ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది.

– f/1.8 ఎపర్చరుతో 50మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 13మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా f/2.4 ఎపర్చరుతో, DX+ కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది.

– f/2.4 ఎపర్చరుతో 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

– ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

-ఈ కొత్త నోకియా X30 5G 2 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

– ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని HMD పేర్కొంది.

ధర, లభ్యత:

Nokia X30 5G ఐస్ వైట్, క్లౌడీ బ్లూ రంగులలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. సింగిల్ 8జిబి + 256జిబివెర్షన్ కోసం రూ. 48,999. Nokia.com , Amazon.inతోపాటు ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రీ-బుకింగ్ ఈరోజు, ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమైంది. ఈ డివైస్ ఎంపిక చేసిన రిటైల్ కౌంటర్లు, Nokia.com, ఆన్‌లైన్ పోర్టల్‌లలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం అవుతుంది.

ఈ ఆఫర్లు పొందవచ్చు:

Nokia.comలో కొనుగోలు చేస్తే రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఫ్రీ నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ విలువ రూ. 2,799

ఫీ 33W ఛార్జర్ విలువ రూ. 2,999

అదనంగా Amazon.inలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 4000 తగ్గింపు పొందవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తలు చదవండి..