Mobile Charger: కరెంట్ లేకుండానే మొబైల్ చార్జింగ్ పెట్టొచ్చు.. అదెలాగంటే..
రోజులు మారాయ్.. టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. తప్పనిసరి అనుకున్న వాటికి ప్రత్యామ్నాయాలు వచ్చేస్తున్నాయి. అలా వచ్చిందే ఈ సోలార్ మొబైల్ చార్జర్. ఇప్పుడు మొబైల్ ఫోన్లను చార్జ్ చేయడానికి విద్యుత్ అవసరం లేదు.
Updated on: Feb 15, 2023 | 4:25 PM

సాధారణంగా మొబైల్ చార్జింగ్ పెట్టడానికి విద్యుత్ తప్పనిసరి. మొబైల్ ఫోన్లను చార్జ్ చేయడానికి విద్యుత్ తప్పనిసరి. ఏదైనా ప్రయాణాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ చార్జింగ్ పెట్టడానికి పవర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్తాం. అయితే, ఇక నుంచి మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి విద్యుత్ అవసరం లేదు. జస్ట్ సూర్యుడి వెలుగు ఉంటే చాలు. సూర్య కిరణాలతోనే మొబైల్ చార్జింగ్ పెట్టొచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ప్రస్తుతం మార్కెట్‌లో సోలార్ మొబైల్ చార్జర్ల హవా నడుస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లోనూ అందుబాటులో ఉంది. ఈ సోలార్ చార్జర్‌తో మొబైల్‌ను ఈజీగా చార్జ్ చేయొచ్చు. ఇందుకోసం సోలార్ చార్జర్‌ను ఎండలో ఉంచి, మీ ఫోన్‌ను దాని కేబుల్‌కి కనెక్ట్ చేయాలి. అలా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ క్షణాల్లోనే ఫుల్ అవుతుంది.

ఇక నుంచి కరెంట్ పోయిందని, ఫోన్‌లో చార్జింగ్ లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ చార్జర్ల కంటే సోలార్ మొబైల్ చార్జర్లు చాలా చౌకగా లభిస్తున్నాయి. అంతేకాదు.. ఈ చార్జర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. విద్యుత్ కనెక్షన్ లేని ప్రదేశాల్లో ఇది ఉపయోగపడుతుంది.

ఈ చార్జర్ కేవలం రూ.330 లకే అమెజాన్‌లో లభిస్తుంది. ఈ ఛార్జర్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణ సమయంలో విద్యుత్ కనెక్షన్ లేని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇది ఉపకరిస్తుంది.

ఈ చార్జర్ కేవలం రూ.330 లకే అమెజాన్‌లో లభిస్తుంది. ఈ ఛార్జర్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణ సమయంలో విద్యుత్ కనెక్షన్ లేని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇది ఉపకరిస్తుంది.

సోలార్ మొబైల్ ఛార్జర్ సహాయంతో మొబైల్‌ను ఫ్రీగా చార్జ్ చేయవచ్చు. దీనికి విద్యుత్, జనరేటర్, ఇన్వర్టర్ అవసరం లేదు. సోలార్ మొబైల్ చార్జర్ల వినియోగం వల్ల విద్యుత్ బిల్లు కూడా ఆదా అవుతుంది.

సోలార్ ఛార్జర్ అంటే ఏమిటి? సోలార్ ఛార్జర్ సౌరశక్తితో నడుస్తుంది. ఇంట్లో కరెంటు లేకపోయినా, విద్యుత్ సదుపాయం లేకపోయినా ఈ సోలార్ చార్జర్ సహాయంతో ఫోన్ ను చార్జింగ్ చేసుకోవచ్చు. కాసేపట్లోనే ఫోన్ చార్జింగ్ ఫుల్ అవుతుంది.