Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ ఆగడం లేదా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారా..?

Smart Phone: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు సూపర్ కంప్యూటర్‌లుగా మారాయి. అన్ని రకాల అవసరాలను తీర్చే ఫీచర్‌లతో, యాప్‌లతో అమర్చబడి ఉన్నాయి.

Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ ఆగడం లేదా.. అయితే మీరు ఈ తప్పులు   చేస్తున్నారా..?
Phone Battery
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2022 | 3:56 PM

Smart Phone: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు సూపర్ కంప్యూటర్‌లుగా మారాయి. అన్ని రకాల అవసరాలను తీర్చే ఫీచర్‌లతో, యాప్‌లతో అమర్చబడి ఉన్నాయి. కానీ హ్యాండ్‌సెట్‌లో పెద్ద సంఖ్యలో కొత్త ఫీచర్లు ఉన్నందున ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతుంది. తాజా ప్రాసెసర్, ప్రకాశవంతమైన స్క్రీన్ డిస్ప్లే, వేగవంతమైన ఇంటర్నెట్ ఫోన్ బ్యాటరీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి అనేక కారణాలున్నాయి. మీరు ఫోన్ బ్యాటరీ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని పరిష్కరించవచ్చు. మీ Android లేదా iPhone బ్యాటరీ జీవితాన్ని పెంచే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. బ్యాటరీ ఎక్కువ వినియోగించే యాప్‌లను ఆపండి

అనేక జనాదరణ పొందిన యాప్‌లు భారీ గ్రాఫిక్‌లతో వస్తాయి. ఇవి ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తాయి. ఈ పరిస్థితిలో ఫోన్ నుంచి ఈ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి బదులుగా వాటిని బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసివేయండి.

2. Wi-Fi యాక్సెస్

Wi-Fi కనెక్షన్‌ని ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచే అలవాటు మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే అవసరం లేనప్పుడు మీ Wi-Fi కనెక్షన్‌ని డిస్‌కనెక్ట్ చేయడం వల్ల మీ డేటాను సేవ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే Wi-Fiని ఉపయోగించండి.

3. నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

Facebook, Twitter లేదా న్యూస్‌ వెబ్‌సైట్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌ల వల్ల ఎక్కువ బ్యాటరీ అయిపోతుంది. మీ బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించడానికి మీరు అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో దీన్ని సులభంగా చేయవచ్చు. యాప్ చిహ్నాన్ని పుష్ చేసి పట్టుకోవడం ద్వారా ‘యాప్ సమాచారం’ కనిపిస్తుంది. దీని కింద మీరు నోటిఫికేషన్ ఎంపిక ఉంటుంది. దీన్ని మీరు ఆన్, ఆఫ్ చేసుకునే సౌలభం ఉంటుంది.

4. పవర్‌ సేవ్‌ మోడ్

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. కానీ చాలామంది దీనని వినియోగించరు. ఇది మీ ఫోన్ బ్యాటరీ డ్రెయిన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఆన్ చేయండి. బ్యాటరీ సేవ్‌ మోడ్ మీ బ్యాటరీని అయిపోగొట్టే అన్ని ప్రోగ్రామ్‌లను మూసివేస్తుంది. మీ బ్యాటరీ అయిపోతున్నప్పుడు, ఛార్జింగ్ ఎంపిక అందుబాటులో లేనప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Viral Photos: ఎవరెస్ట్‌ పర్వతం గురించి ఐదు అద్భుత నిజాలు.. అవేంటంటే..?

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే