AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mechanical Trees: గాలి ప్యూరిఫైయర్ ఈ మెకానికల్‌ చెట్లు.. ఒక్క చెట్టు కొన్ని వేల చెట్లతో సమానం

Mechanical Trees: భూమిపై చెట్లు (Trees)తరిగిపోతున్నాయి.. రోజురోజుకూ కార్బన్‌డయాక్సైడ్‌ పెరిగిపోతోంది. దీనిని అధిగమించడం ఎలా.. ఈ ఆలోచన నుంచే ‘మెకానికల్‌ చెట్లు’ (Mechanical Trees)ఊపిరిపోసుకుంటున్నాయి...

Mechanical Trees: గాలి ప్యూరిఫైయర్ ఈ మెకానికల్‌ చెట్లు.. ఒక్క చెట్టు కొన్ని వేల చెట్లతో సమానం
Mechanical Trees
Surya Kala
|

Updated on: Jan 29, 2022 | 2:29 PM

Share

Mechanical Trees: భూమిపై చెట్లు (Trees)తరిగిపోతున్నాయి.. రోజురోజుకూ కార్బన్‌డయాక్సైడ్‌ పెరిగిపోతోంది. దీనిని అధిగమించడం ఎలా.. ఈ ఆలోచన నుంచే ‘మెకానికల్‌ చెట్లు’ (Mechanical Trees)ఊపిరిపోసుకుంటున్నాయి. నిరంతరం కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుంటూ.. గాలిని శుభ్రం చేసే ఈ చెట్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి.

వాహనాలు, పరిశ్రమలు వదిలే కాలుష్యంతో రోజురోజుకు భూమి వేడెక్కి వాతావరణంలో తీవ్రమైన మార్పులు జరగుతున్నాయి. భూమిపై కార్బన్‌డయాక్సైడ్‌ పరిమితి దాటిపోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే చర్యలు అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్త క్లౌస్‌ లాక్నర్‌ కృత్రిమ ‘యంత్రపు చెట్ల ’కు రూపకల్పన చేశారు. వీలైనంత తక్కువ స్థలంలో, ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకొనేలా ‘మెకానికల్‌’ చెట్లను రూపొందించారు. ఐదు అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తుతో గుండ్రంగా, ఎత్తైన టవర్లలా ఉండే ఈ చెట్లలో.. వందలకొద్దీ గుండ్రని డిస్కులు ఒకదానిపై మరొకటి పేర్చి ఉంటాయి. వాటిపై ప్రత్యేకమైన రసాయన పదార్థపు పూత ఉంటుంది. ఈ డిస్కుల మీదుగా గాలి వీచినప్పుడు అందులోని కార్బన్‌డయాక్సైడ్‌ను.. ఈ రసాయనం పీల్చుకుంటుంది. డిస్కులు కార్బన్‌డయాక్సైడ్‌తో నిండాక.. దిగువన ఉన్న బ్యారెల్‌లోకి జారిపోతాయి. అక్కడ వేడి నీటి ఆవిరిని పంపడం ద్వారా.. డిస్కులపై ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ను వేరుచేస్తారు. తర్వాత డిస్కులను మళ్లీ పైకి జరుపుతారు. ప్రతి 30 నిమిషాలకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది.

కొన్నివేల మామూలు చెట్లన్నీ కలిసి పీల్చుకునేంత ఆక్సిజన్‌ను ఒక్క మెకానికల్‌ చెట్టు సంగ్రహిస్తుందని శాస్త్రవేత్త క్లౌస్‌ లాక్నర్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెకానికల్‌ చెట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఇలా గాల్లోంచి తొలగించిన కార్బన్‌డయాక్సైడ్‌ను భూమి పొరల్లో నిక్షిప్తం చేయవచ్చు.. అంతేకాదు..పెట్రోల్, డీజిల్‌ వంటివాటిని కృత్రిమంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం అరిజోనాలో రోజుకు వెయ్యి టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునే స్థాయిలో.. ‘మెకానికల్‌ చెట్ల తోట’ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు.

Also Read:   పిల్లలు పొద్దున్నే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారా.. అయితే పెద్దవారు ఈ విషయాలను తెలుసుకోవలిసిందే..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ