చేసే పని టాటూలు వేయడం.. సైడ్ బిజినెస్‌ పెళ్లిళ్లు చేసుకోవడం.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..

Tattoo Artist: రెండో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది ఏం చెబుతారు. ఒక్కరిని భరించడమే చాలా కష్టం రెండో పెళ్లి కూడానా.. అంటూ సమాధానమిస్తారు.

చేసే పని టాటూలు వేయడం.. సైడ్ బిజినెస్‌ పెళ్లిళ్లు చేసుకోవడం.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
Man With 8 Wives
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2022 | 2:36 PM

Tattoo Artist: రెండో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది ఏం చెబుతారు. ఒక్కరిని భరించడమే చాలా కష్టం రెండో పెళ్లి కూడానా.. అంటూ సమాధానమిస్తారు. చాలా మంది 2 లేదా 3 పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వారందరూ కలిసి సంతోషంగా ఉండలేరు. దీనికోసం వేర్వేరు కాపురాలు పెడుతారు. అయితే థాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరందరు ఒకే ఇంట్లో కలిసి మెలసి ఉంటున్నారు. ఈ వ్యక్తి పేరు ఓంగ్ డామ్ సోరోట్. ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా టాటూలు వేస్తాడు. ఇప్పుడు ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ ప్రకారం.. ఒంగ్ డామ్ వృత్తిరీత్యా టాటూ ఆర్టిస్ట్. అతను తన 8 మంది భార్యలతో ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. విశేషమేమిటంటే భార్యలందరూ అతన్ని చాలా ప్రేమిస్తారు అందరూ తమలో తాము స్నేహపూర్వకంగా ఉంటారు. వారి మధ్య ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవలు జరగవు. ఒంగ్ తన భార్యలను ఎప్పుడు, ఎలా కలిసాడు అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం..

అతని మొదటి భార్య పేరు నాంగ్ స్ప్రైట్. ఆమెను ఒక స్నేహితుడి పెళ్లిలో కలుసుకున్నాడు. ఇద్దరూ మొదటి చూపులోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు తరువాత వివాహం చేసుకున్నారు. రెండవ భార్య నోంగ్ ఎల్‌ని మొదటిసారి మార్కెట్‌లో కలుసుకున్నాడు. మూడో భార్య నాంగ్ నాన్‌ను ఆసుపత్రిలో కలుసుకున్నాడు. నాలుగో భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో, ఐదో భార్యని ఫేస్‌బుక్‌లో, ఆరో భార్యను టిక్‌టాక్‌లో కలుసుకున్నాడు. తర్వాత పరిచయం పెళ్లి చేసుకోవడం జరుగుతూనే ఉంది.

ఓంగ్ ఏడో భార్య నాంగ్‌ని గుడిలో చూసి పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఏడుగురు భార్యలతో సెలవులు గడపడానికి వెళ్లి ఎనిమిదో భార్య నోంగ్ మాయిని కలుసుకున్నాడు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 8 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓంగ్ ధనవంతుడేమి కాదు. అయినా అతడి భార్యలందరూ అతనితో నివసిస్తున్నారు కానీ వారందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కలిసి జీవించడం విశేషం.

లవంగం టీతో దగ్గు, జలుబు, గొంతునొప్పి మాయం.. కానీ ఎప్పుడు తాగాలో తెలుసా..?

శని దేవుడు నలుపు రంగులో ఉంటాడు.. నల్లటి వస్తువులనే ఇష్టపడుతాడు.. దీని వెనుక పరమార్థం ఏంటో తెలుసా..?

IND VS WI: వెస్టిండీస్ జట్టులో గొడవలు.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరో ఆటగాడికి వాగ్వాదం..