Oxygen on Moon: చంద్రుడిపై పుష్కలంగా ఆక్సీజన్.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి సంచలన విషయాలు..!
Oxygen on Moon: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. చాలా దేశాలు విశ్వాంతరాలలో జరుగుతున్న పరిణామాలపై, గ్రహాలపై పరిశోధనలు సాగిస్తున్నాయి.
Oxygen on Moon: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. చాలా దేశాలు విశ్వాంతరాలలో జరుగుతున్న పరిణామాలపై, గ్రహాలపై పరిశోధనలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్స్, చంద్రుడిపై జీవం ఉనికి గురించిన ఊహలు పెరుగుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా భూమికి అతి సమీపంగా ఉన్న చందమామ మీదకు ఇప్పటికే మనిషి వెళ్లివచ్చాడు. అక్కడ ఆక్సిజన్‌ను అందించగలిగితే మనుషులు జీవించడం అసాధ్యమేం కాదన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే తాజా నాసా అధ్యయనం నమ్మశక్యం కాని విషయాలను బయటపెట్టింది. భూమి మీదున్న జనాభా అంతటికీ చంద్రుడి ఉపరితలం లక్ష ఏళ్లపాటు ఆక్సిజన్ అందించగలదని తెలిపింది.
వాస్తవానికి చంద్రుడిపై వాతావరణం ఉండదు. ఉన్న కొద్దిపాటి వాయువులు కూడా హైడ్రోజన్, నియాన్, ఆర్గాన్ లాంటివే ఉన్నాయి. ఇవి జీవం మనుగడకు ఏమాత్రం ఉపయోగపడవు. అయితే ఇటీవల అక్కడి మట్టి నమూనాలపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చంద్రుడి ఉపరితలం పైపొరల్లోని మట్టిలో ఆక్సిజన్ ఉన్నట్టు తేలింది. ఈ పైపొరలను రిగోలిథ్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. రిగోలిథ్‌లో 45% దాకా ఆక్సిజన్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. భూమి లాగే చంద్రుడి గర్భంలో కూడా సిలికా, అల్యూమీనియం, ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్‌ల వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల్లోనే ఆక్సిజన్ నిక్షిప్తమై ఉంటుంది. దీనిని నేరుగా పీల్చలేం. అయితే, దీనిని మనిషి పీల్చడానికి అనువైన ఆక్సిజన్‌గా మార్చాలంటే ఎలక్ట్రోలైసిస్ లాంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీని కోసం ఈ మట్టి పొరల్లోని ఆక్సైడ్‌లను ద్రవ రూపంలోకి మార్చాల్సి ఉంటుందన్నారు.
అయితే, ఇప్పటివరకు చంద్రుడి మట్టిపై జరిపిన పరిశోధనలను బట్టి రిగోలిథ్‌లో ఒక్కో క్యూబిక్ మీటర్‌లో 630 కిలోల ఆక్సిజన్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మనిషి బతకాలంటే రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్ చాలు. అంటే 630 కిలోల ఆక్సిజన్‌తో మనిషి రెండు సంవత్సరాలు బతకొచ్చు. రిగోలిథ్ 10 మీటర్లు ఉందనుకొంటే.. దాని నుంచి 800 కోట్ల మంది జనాకు లక్ష సంవత్సరాలు సరిపడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also read:
Jawad Cyclone to AP: ఏపీకి మరో తుఫాను ముప్పు..! కుండపోత వానలతో విలవిలలాడిపోతున్న ఏపీ.. (వీడియో)
God Father: గాడ్ ఫాదర్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలకపాత్రలో..