Oppo Find N3 Flip: భారత మార్కెట్లోకి ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. లుక్ ఉంది భయ్యా అసలు..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లోకి తన ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Find N3 Flip) పేరుతో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాగా తాజాగా గురువారం ఒప్పో ఈ ఫోన్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇక ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌కు సీక్వెల్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఒప్పో ఇదే ఏడాదిలో తీసుకొచ్చిన....

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ దిగ్గజ కంపెలన్నీ మడతపెట్టే ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే సామ్‌సంగ్‌తో పాటు పలు ప్రధాన సంస్థలు మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్స్‌ను లాంచ్ చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో స్మార్ట్ ఫోన్ దిగ్గజం వచ్చి చేరింది.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లోకి తన ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Find N3 Flip) పేరుతో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాగా తాజాగా గురువారం ఒప్పో ఈ ఫోన్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇక ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌కు సీక్వెల్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్2 ఒప్పో ఇదే ఏడాదిలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ధర రూ. 94,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 22 నుంచి కస్టమర్స్‌కి అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 8 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 12 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.8 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ మెయిన్ డిస్‌ప్లేను ఇచచారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇక ఔటర్ డిస్‌ప్లే విషయానికొస్తే 3.26 ఇంచెస్‌తో ఎస్‌డీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గొరాల్లో గ్లాస్ 7 ప్రొటెక్షన్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరాతోపాటు 48 ఎంపీ, 32 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 5.3 ఈ ఫోన్ సొంతం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..