OnePlus 11 5G: వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది వన్‌ప్లస్‌ ఆ తర్వాత బడ్జెట్‌ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ ఇటీవల ఓ ప్రీమియం బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాగా...

OnePlus 11 5G: వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
Oneplus 11 5g
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 16, 2024 | 12:17 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది వన్‌ప్లస్‌ ఆ తర్వాత బడ్జెట్‌ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ ఇటీవల ఓ ప్రీమియం బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాగా ఈ ఫోన్‌ సేల్స్‌ భారీగానే జరిగాయి. వన్‌ప్లస్‌ 11 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఈ ఫోన్‌పై వన్‌ప్లస్‌ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌ లాంచింగ్‌ సమయంలో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 56,999కి లాంచ్‌ చేసింది. అయితే ఆ తర్వాత వన్‌ప్లస్‌ ఈ ఫోన్‌పై రూ. 2000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇక తాజాగా మరోసారి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్‌పై తాజాగా కంపెనీ మరో రూ. 3000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్‌ 11 5జీ స్మార్ట్ ఫోన్‌పసై మొత్తంగా రూ. 5000 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేవు వన్‌ప్లస్‌ 11 స్మార్ట్‌ ఫోన్‌పై పలు బ్యాంక్‌లు సైతం ఆఫర్లను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 48,999కే సైతం చేసుకోవచ్చు. వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌ను గరిష్టంగా రూ. 5000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. వన్‌ప్లస్‌ 11 స్మార్ట్ ఫోన్‌పై ఇన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ+ ఈ4 డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ కేవలం 25 నిమిషాల్లోనే వంద శాతం బ్యాటరీ పూర్తవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!