Aadhar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుందా? ఇలా ఈజీగా మార్చుకోండి..

ఆధార్ కార్డులో వ్యక్తుల ప్రాథమిక వివరాలు ఉంటాయి. ఇంటి పేరుతో సహా వ్యక్తి పేరు, ఫొటో, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు అందులో ఉంటాయి. ఈ సమాచారం అంతా కచ్చితంగా ఉండాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఒకేవేళ తప్పుగా ఉంటే మార్చుకునే అవకాశం కూడా యూఐడీఏఐ ఇస్తుంది. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫొటోతో పాటు పుట్టిన తేదీని కూడా మార్చుకోడానికి అవకాశం ఉంటుంది. అయితే పుట్టిన తేదీని మాత్రం ఒక్కసారి మాత్రమే మార్చుకునే వీలుంటుంది.

Aadhar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుందా? ఇలా ఈజీగా మార్చుకోండి..
Aadhaar Card
Follow us
Madhu

|

Updated on: Apr 16, 2024 | 3:12 PM

మన దేశంలో అత్యంత కీలకమైన పత్రం ఆధార్ కార్డు. ఇక్కడ ఏది చేయాలన్నా ఈ కార్డు తప్పనిసరి. ఇదే భారత పౌరసత్వానికి ప్రాథమిక గుర్తింపుకార్డు. బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా.. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. లేదా ఏదైనా రుణం పొందాలన్నా ఈ ఏ పని కావాలన్నా ఆధార్ కార్డే ప్రాథమిక అవసరం. ఈ కార్డును కలిగి ఉండటమే కాదు. దానిలోని వివరాలు కూడా సమగ్రంగా, కచ్చితంగా ఉండాలి. వాటిల్లో తప్పుగా వివరాలు ఉంటే ఇబ్బందులు పడతారు. భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆధార్ కార్డులోని ప్రతి వివరం సక్రమంగా ఉండాలి. ఒకవేళ తప్పుగా ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. అందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. ఆధార్ కార్డులో వివరాలు అప్ డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పుట్టిన తేదీ తప్పుగా ఉంటే..

ఆధార్ కార్డులో వ్యక్తుల ప్రాథమిక వివరాలు ఉంటాయి. ఇంటి పేరుతో సహా వ్యక్తి పేరు, ఫొటో, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు అందులో ఉంటాయి. ఈ సమాచారం అంతా కచ్చితంగా ఉండాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఒకేవేళ తప్పుగా ఉంటే మార్చుకునే అవకాశం కూడా యూఐడీఏఐ ఇస్తుంది. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫొటోతో పాటు పుట్టిన తేదీని కూడా మార్చుకోడానికి అవకాశం ఉంటుంది. అయితే పుట్టిన తేదీని మాత్రం ఒక్కసారి మాత్రమే మార్చుకునే వీలుంటుంది. పాన్ కార్డు, జనన ధ్రువీకరణపత్రం, పాస్ పోర్టు, బ్యాంక్ పాస్ బుక్ వంటి పత్రాలలో ఏదో ఒక దానిని ఉపయోగించి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు.

ఇలా సులభంగా మార్చుకోవచ్చు..

  • మొదటిగా మీరు మీ దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ కు వెళ్లి ఆధార్ అప్ డేట్/ కరెక్షన్ ఫారమ్ సాయంతో వివరాలు సమర్పించాలి. అందులో మీరు అప్ డేట్ చేయాలనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలు.. దానిని ధ్రువీకరించే పత్రాన్ని సమర్పించాలి.
  • అక్కడి ఏజెంట్ ఈ దరఖాస్తుతో పాటు రుజువును తీసుకొని, వాటిని సరి చూసి మీ బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీని మార్చడానికి రూ. 50 రుసుము తీసుకుంటారు.
  • ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక వారం పది రోజుల్లో మీ పుట్టిన తేదీ అప్ డేట్ అవుతుంది.
  • దీనిని ట్రాక్ చేయడానికి వీలుగా మీరు చేసుకున్న దరఖాస్తు సమయంలో ఆధార్ కేంద్ర వారు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దీని సాయంతో మీరు అప్లికేషన్ ను ట్రాక్ చేయొచ్చు.
  • అప్ డేట్ పూర్తియితే మీరు వెంటనే కార్డును అధికారిక యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి కొత్త కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలలో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ ను సంప్రదించొచ్చు. అందుకోసం 1947 నంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది. లేదా help@uidai.gov.in మెయిల్ చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..