FB Messenger: ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్ బుక్ మెసెంజర్ లో గతంలోనూ ఫొటోలను షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కేవలం తక్కువ నాణ్యత కలిగిన ఎస్‌డీ ఫొటోలను మాత్రమే పంపే వీలుండేది. ఇప్పుడు కూడా ఆ ఆప్షన్ ఉంది. దానికి అదనంగా హెచ్‌డీ ఫొటోలను పంపుకొనే వీలు కల్పించింది. అంటే ఎస్‌డీ తో పాటు హెచ్‌డీ ఫొటోలను కూడా వినియోగదారులు పంపవచ్చు.

FB Messenger: ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
Facebook
Follow us

|

Updated on: Apr 16, 2024 | 3:47 PM

ప్రపంచంలోని ప్రజలందరినీ ఏకం చేసిన సామాజిక మాధ్యమం పేస్ బుక్. దీనిలో ఖాతా లేని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. దేశ సరిహద్దులను చెరిపివేసి, వివిధ ప్రాంతాల ప్రజలను స్నేహితులను చేసింది. ఒకరి సంప్రదాయాలు మరొకరు తెలుసుకునే వీలు కల్పించింది. ఇప్పుడు ఫేస్ బుక్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. వారి ఆనందాలు, సంతోషాలను మిత్రులతో మరింత ఉత్సాహంగా పంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా హెచ్‌డీ ఫొటోలను పంపించే వీలు కల్పించింది. దీని ద్వారా అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను మీ స్నేహితులను పంపవచ్చు. అలాగే ఆల్బమ్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. 100 ఎంబీ వరకూ ఫైల్స్ ను కూడా మెసెంజర్ లో షేర్ చేసుకునే అవకాశం ఉంది.

హెచ్‌డీ ఫొటోలను పంపే వీలు..

ఫేస్ బుక్ మెసెంజర్ లో గతంలోనూ ఫొటోలను షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కేవలం తక్కువ నాణ్యత కలిగిన ఎస్‌డీ ఫొటోలను మాత్రమే పంపే వీలుండేది. ఇప్పుడు కూడా ఆ ఆప్షన్ ఉంది. దానికి అదనంగా హెచ్‌డీ ఫొటోలను పంపుకొనే వీలు కల్పించింది. అంటే ఎస్‌డీ తో పాటు హెచ్‌డీ ఫొటోలను కూడా వినియోగదారులు పంపవచ్చు. దాని కోసం ఫొటోను సెండ్ చేసేటప్పుడు హెచ్ డీ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అంటే పైన కుడివైపున కనిపించే హెచ్ డీ బ్యాడ్జ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

పంపే విధానం..

  • మెసెంజర్ ను ఓపెన్ చేయండి.
  • చాట్ కంపోజర్ మెనూ నుంచి మీరు పంపాలనుకునే చిత్రాన్ని ఎంపిక చేసుకోండి.
  • హెచ్ డీ టోగుల్‌ను ప్రారంభించండి.
  • మీ మిత్రులకు సెండ్ చేయండి.

ఆల్బమ్ షేరింగ్..

ఇప్పుడు మెసెంజర్‌లో ఒకటి కన్నా ఎక్కువ ఫొటోలను పంపే వీలు కూడా ఉంది. ఇలాంటి ఫొటోలను ఆల్బమ్‌గా షేర్ చేయవచ్చు. దానికి మనం నచ్చిన పేరు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా ఆ పేరును మార్చుకోవచ్చు. ఆ ఆల్బమ్ కు మరికొన్ని ఫొటోలను అదనంగా కలపవచ్చు లేదా తీసివేయవచ్చు. ఈ ఆల్బమ్‌లను వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌లతో షేర్ చేసుకునే వీలు ఉంది. మెసెంజర్‌కి కొత్త యూజర్లను యాడ్ చేసినా అప్‌డేట్ వస్తుంది. కేవలం క్యూ ఆ కోడ్‌ని స్కాన్ చేసి, లింక్‌పై నొక్కడం వల్ల మెసెంజర్‌కి కొత్త పరిచయం చేయవచ్చు. మెసెంజర్‌ లో ఇప్పుడు 100 ఎంబీ పరిమాణంలో ఉన్న ఫైల్‌లను షేర్ చేయవచ్చు,

పెద్ద ఫైల్స్ ను పంపే అవకాశం..

మేటా ఇటీవల హెచ్ డీ మీడియాను పంపే సామర్థ్యాన్ని కూడా పరిచయం చేసింది. వినియోగదారులు అధిక నాణ్యత ఫొటోలను చాలా సులభంగా పంపించగలరు. టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా 2 జీబీ వరకూ ఉన్న పెద్ద ఫైల్స్ ను కూడా పంపడానికి అనుమతి లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..