Oneplus 11: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. 11 సిరీస్‌ ఫోన్‌ వచ్చేస్తోంది, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..

స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్న వన్‌ప్లస్‌ ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా..

Oneplus 11: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. 11 సిరీస్‌ ఫోన్‌ వచ్చేస్తోంది, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..
Oneplus 11
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 18, 2022 | 6:50 AM

స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్న వన్‌ప్లస్‌ ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్‌ 11ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 11 ప్రోకి బదులుగా వన్‌ప్లస్‌ 11ను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుందని మ్యాక్స్‌ జంగర్‌ రిపోర్ట్‌ తెలిపింది.

ఇక ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో పవర్‌ఫుల్‌ స్పెసిఫికేషన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌2 చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని, ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 ఇంచ్‌ క్యూహెచ్‌డీ+ అమోల్డ్‌ డిస్‌ప్లేతో ఫ్రంట్‌ కెమెరా కోసం పంచ్‌ హోల్‌ కటౌట్‌తో రానుందని తెలుస్తోంది.

ఇక ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరాను అందించనున్నారు. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ ధరపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..