Google maps: హమ్మయ్యా మ్యాప్స్‌లో ఆ ఫీచర్.. ఇకపై నో టెన్షన్
ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్. ఈ క్రమంలోనే మొన్నటి మొన్నట వాట్సాప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు....

ఒకప్పుడు ఏదైనా అడ్రస్ తెలియకపోతే పక్కన ఉన్న వారి అడిగి తెలుసుకుంటూ వెళ్లేవారు. కానీ ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి అడ్రస్ గురించి టెన్షన్ పడే అవసరం లేకుండా పోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో ఏ అడ్రస్ అయినా ఇట్టే తెలుసుకునే అవకాశం లభించింది.
ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్. ఈ క్రమంలోనే మొన్నటి మొన్నట వాట్సాప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా మ్యాప్స్ ఉపయోగించే సమయంలో ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య స్క్రీన్ లాక్ కావడం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే గూగుల్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఆ కొత్త ఫీచర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వివరాలను ఎంటర్ చేస్తే సమయంతో పాటు షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. అయితే మ్యాప్స్ ఓపెన్ చేసిన సమయంలో ఒకవేళ ఫోన్ లాక్ అయితే మళ్లీ అన్‌లాక్ చేసి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్ లాక్ స్క్రీన్‌పై అన్ని వివరాలు ప్రత్యక్షమవుతాయి. దీంతో ఇకపై మ్యాప్స్‌ను ఉపయోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్ లాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మ్యాప్స్‌లో గ్లాన్సబుల్ ఫీచర్ డీఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. అయితే దీనిని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి, చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అందులో సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం అందులో స్క్రోల్ చేసి, నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలాగే కిందకు స్క్రోల్ చేస్తే ‘గ్లాన్సబుల్ డైరెక్షన్స్ వైల్ నావిగేటింగ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




