- Telugu News Photo Gallery Technology photos Pebble launching world’s slimmest Bluetooth calling smartwatch, Check here for full details
Smart Watch: ప్రపంచంలో అత్యంత సన్నని బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్యాడ్జెట్. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ వాచ్‌లతో చేయలేని పని అంటూ లేదు. అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పెబల్ కంపెనీ కొత్త వాచ్‌ను లాంచ్ చేస్తోంది. పెబల్ రాయల్ పేరుతో ఈ కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Feb 29, 2024 | 10:21 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం పెబల్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పెబల్ రాయల్ పేరుతో తీసుకొస్తున్న ఈ వాచ్ ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్ వాచ్ అని కంపెనీ చెబుతోంది.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పనిచేనున్న ఈ స్మార్ట్ వాచ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ డయల్‌ను ఇవ్వనున్నారు. ఈ వాచ్ మొత్తం బాడీ థిక్‌నెక్ కేవలం 6 ఎమ్‌ఎమ్ కావడం విశేషం. ఇక ఈ వాచ్‌లో 1.43 ఇంచెస్‌తో కూడిన సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

ఇక ఈ వాచ్‌లో అల్ట్రా వైడ్ కలర్ గాముట్, సూపర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ వాచ్‌లో ఇన్‌బుల్ట్‌గా వాయిస్ అసిస్టెంట్‌ను అందించనున్నారు.

ఈ స్మార్ట్ వాచ్‌లో అలారమ్, కాలుక్యులేటర్, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 వంటి ఫీచర్లను అందించనున్నారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 రోజులు పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ కేవలం 40 గ్రాములు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ వాచ్‌ను విస్కీ బ్రౌన్, పైన్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ వాచ్ ధర రూ. 4,299గా నిర్ణయించారు.




