AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CMF Phone 1: ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసిన సీఎమ్‌ఎఫ్‌1 ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1 భారతమార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌ను వచ్చిన ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ లభించిన విషయం తెలిసిందే. నథింగ్‌ నుంచి వచ్చిన రెండు ఫోన్‌లు కూడా ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఇదే కంపెనీ నుంచి ఓ బడ్జెట్‌ ఫోన్‌...

CMF Phone 1: ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసిన సీఎమ్‌ఎఫ్‌1 ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?
Cmf Phone 1
Narender Vaitla
|

Updated on: Jul 09, 2024 | 10:15 AM

Share

ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1 భారతమార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌ను వచ్చిన ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ లభించిన విషయం తెలిసిందే. నథింగ్‌ నుంచి వచ్చిన రెండు ఫోన్‌లు కూడా ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఇదే కంపెనీ నుంచి ఓ బడ్జెట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.

సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌ 1 పేరుతో తీసుకొచ్చిన ఈ బడ్జెట్‌ ఫోన్‌ను సోమవారం లాంచ్‌ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను లిస్టింగ్ చేశారు. అయితే తొలి సేల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నదానిపై ఇంకా ప్రకటన చేయలేదు. కమింగ్ సూన్‌ అని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ లిస్ట్‌ అయ్యింది. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ అసలు ధర రూ. 19,999కాగా, లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,999కే లభిస్తోంది. ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 21,999కాగా, 17,999కి లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ను స్టైలింగ్‌ లుక్‌లో డిజైన్‌ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో రానున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. రెయిర్ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌తో రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తారు. ఏడాది మ్యానిఫ్యాక్చరింగ్ వారంటీ అందించనున్నారు. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ఈ ఫోన్‌ మంచి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..