Nokia C-30: నోకియా నుంచి తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ సి-30.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడురోజులు బ్యాకప్!

హెచ్ఎండీ గ్లోబల్ కొత్త సి-సిరీస్ స్మార్ట్‌ఫోన్ నోకియా సి 30 ని పరిచయం చేసింది. జియోతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఈ ఫోన్ భారతదేశంలో ప్రవేశపెట్టారు.

Nokia C-30: నోకియా నుంచి తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ సి-30.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడురోజులు బ్యాకప్!
Nokia C 30 Smart Phone
Follow us
KVD Varma

|

Updated on: Oct 22, 2021 | 8:03 AM

Nokia C-30: హెచ్ఎండీ గ్లోబల్ కొత్త సి-సిరీస్ స్మార్ట్‌ఫోన్ నోకియా సి 30 ని పరిచయం చేసింది. జియోతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఈ ఫోన్ భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఎంట్రీ లెవల్ నోకియా సి 30 జియో ఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్‌తో నోకియా నుండి ప్రత్యేకంగా వచ్చిన నాల్గవ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఫోన్‌లో రెండు స్టోరేజ్ ఆప్షన్‌లను ఇచ్చింది.

ధరలు రూ. 10,999 నుంచి..

నోకియా C30 ధర 3GB RAM / 32GB స్టోరేజ్ కోసం రూ.10,999 అదేవిధంగా 4GB RAM / 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం రూ.11,999. నోకియా సి 30 లో గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఫోన్‌ను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, nokia.com నుండి కొనుగోలు చేయవచ్చు.

జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌పై 10% డిస్కౌంట్..

జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ఎంపికను ఎంచుకునే కస్టమర్‌లు 10% లేదా గరిష్టంగా 1000 రూపాయల డిస్కౌంట్ పొందుతారు. ఈ విధంగా, ఫోన్ కొనుగోలుపై, కస్టమర్ 3GB, 4GB వేరియంట్‌ల కోసం వరుసగా రూ .9,999, రూ. 10,999 చెల్లించాల్సి ఉంటుంది. జియో యాప్ ద్వారా కస్టమర్‌లు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు

  • నోకియా సి 30 6.82-అంగుళాల హెచ్‌డి+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఉంచడానికి డిస్‌ప్లే ఎగువన వాటర్-డ్రాప్ నాచ్‌ను ఇచ్చారు. నోకియా సి 30 పాలికార్బోనేట్ షెల్‌తో వస్తోంది.
  • ఫోన్ బ్యాటరీ 6000 mAh, ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌లో 3 రోజుల బ్యాకప్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.
  • నోకియా C30 డ్యూయల్ 13MP కెమెరాతో వస్తుంది. ఇది 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్‌ని కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సి-సిరీస్ పరికరంలో ఇది అత్యంత శక్తివంతమైన రిజల్యూషన్ కెమెరా అని కంపెనీ పేర్కొంది.
  • నోకియా సి 30 రెండేళ్లపాటు అప్‌డేట్ చేయబడిందని హెచ్‌ఎండి పేర్కొంది. వేలిముద్ర, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు రెండూ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

Pakistan: మళ్ళీ గ్రే లిస్టులో పాకిస్తాన్‌.. టెర్రరిజానికి కొమ్ము కాస్తున్నందుకు రెట్టింపైన పాక్ కష్టాలు!