Chaina space station: ప్రపంచానిది ఓ దారి.. మా దారి రహదారి అంటున్న చైనా..! సొంత స్పేస్‌స్టేషన్‌లో ఆరునెలలు..(వీడియో)
అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ఎజెండాతో ముందుకు వెళ్తుంటే.. చైనా మాత్రం డిఫరెంట్ పంథాలో నడుస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలు మాత్రం స్పేస్ టూరిజంలో ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే...
అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ఎజెండాతో ముందుకు వెళ్తుంటే.. చైనా మాత్రం డిఫరెంట్ పంథాలో నడుస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలు మాత్రం స్పేస్ టూరిజంలో ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసమే అంతరిక్ష ప్రయోగాలు చేస్తుండటం విశేషం. ఈ క్రమంలో మరో అరుదైన ఘట్టానికి చైనా వేదికైంది. ముగ్గురు వ్యోమగాములతో కూడిన రాకెట్‌ను చైనా నింగిలోకి పంపింది. అయితే ఇది ఇతర గ్రహాలపై ప్రయోగం కోసం కాదు. చైనా భారీ ఖర్చుతో నిర్మించిన సొంత స్పేస్ స్టేషన్ కోసం చేసిన ప్రయోగం. భారతకాలమానం ప్రకారం.. అక్టోబరు 15 అర్ధరాత్రి దాటాక గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి, లాంగ్ మార్చ్ 2 ఎఫ్ రాకెట్ లాంఛ్ అయ్యింది. చైనా నిర్మించిన ఈ టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో మొత్తం ముగ్గురు వ్యోమగాములు ఆరు నెలలపాటు గడపనున్నారు.
ఇప్పటిదాకా చైనా చేపట్టిన సుదీర్గ అంతరిక్ష ప్రయోగం ఇదే. టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఎక్విప్మెంట్ను సెటప్ చేయడంతో పాటు టెక్నాలజీని పరీక్షించడానికి వ్యోమగాములు బయలుదేరారు. తద్వారా ఏలియన్ల కోసం పరిశోధనను ముమ్మరం చేయనున్నారు. 2008లో చైనా తరపున స్పేస్ వాక్ చేసిన జాయ్ ఇఝ్గ్యాంగ్ తాజా మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాకి ఇది రెండో అధికారిక స్పేస్ యాత్ర. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం చైనా అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

