world record: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టేశాడు.. అన్నిటిలో డ్రింక్ చేసి…! వరల్డ్ గిన్నిస్ రికార్డు.. (వీడియో)
పబ్‌కి వెళ్లాక... తాగకుండా ఉంటారా చెప్పండి. తాగలేదంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా.. ఇక్కడ 48 ఏళ్ల ఓ వ్యక్తి ఏకంగా 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టేశాడు. అన్నిచోట్లా డ్రింక్ చేసి రికార్డ్ సృష్టించాడు.
పబ్‌కి వెళ్లాక… తాగకుండా ఉంటారా చెప్పండి. తాగలేదంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా.. ఇక్కడ 48 ఏళ్ల ఓ వ్యక్తి ఏకంగా 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టేశాడు. అన్నిచోట్లా డ్రింక్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఇంతకీ అతను ఎవరో ఈ పబ్‌ల కథా కమామీషు ఏంటో చూద్దాం.యూకేకి చెందిన మ్యాట్ ఎల్లిస్ అనే వ్యక్తి 8 గంటల 52 నిమిషాల్లో 51 పబ్‌లు చుట్టి వచ్చాడు. ఈ క్రమంలో అతను ఆరోగ్య రీత్యా ప్రతి పబ్‌లోనూ కేవలం 125 మిల్లీ లీటర్ల మాత్రమే ఆల్కహాల్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇందులో జ్యూస్, డైట్ కోక్ మిక్స్ చేసి డ్రింక్ తీసుకున్నాడు. ఓవరాల్‌గా పబ్‌లను చుట్టొచ్చే సమయంలో అతను మొత్తం 6.3 లీటర్లు ఆల్కాహల్ తీసుకున్నాడట. దీనికి గిన్నిస్ వరల్డ్ ఇద్దరు స్వతంత్ర ప్రతినిధుల్ని నియమించి అతన్ని పర్యవేక్షించింది. అయితే ఈ విషయంపై మ్యాట్ ఎల్లిస్ ఏమంటున్నాడంటే… ఈ ఏడాది చాలా భయంకరమైనదని, కరోనా రూపంలో పబ్‌లనుంచి ప్రజలను దూరం చేసి, వారు వారాంతాల్లో ఆనందంగా గడిపే అవకాశం లేకుండా చేసిందని అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇలాంటి సమయంలో అందరినీ ఆకర్షించాలని, కావాలనే పబ్‌లకి వెళ్లానని చెప్పుకొచ్చాడు ఈ మేరకు తాను వరల్డ్ రికార్డుకి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎల్లిస్ రికార్డును ధృవీకరిస్తే మాత్రం ఇలాంటి ఘనత సాధించిన మొట్ట మొదటి వ్యక్తిగా ఎల్లిస్ నిలుస్తాడు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

