Viral Video: పాపం.. రజనీ స్టైల్లో చేద్దామనుకున్నాడు.. చివరికి ముఖం పగిలింది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
సోషల్ మీడియాలో అనేక వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. వాటిలో వినోదాన్ని పంచే వీడియోలను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తారు. తామకు నచ్చిన వీడియోలను ఇతరులకూ షేర్ చేసి నవ్వుల పువ్వులు పంచుకుంటారు.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. వాటిలో వినోదాన్ని పంచే వీడియోలను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తారు. తామకు నచ్చిన వీడియోలను ఇతరులకూ షేర్ చేసి నవ్వుల పువ్వులు పంచుకుంటారు. అలా ఇప్పుడు నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్న ఓ వీడియో.. ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
వివరాల్లోకి వేళ్తే.. ఈ వీడియోలో కనిపించే ఓ వ్యక్తి.. వినూత్నంగా ఆలోచించి రజనీకాంత్ స్టైల్ కాస్త డిఫెరంట్‌గా ఏదో చేద్దామనుకున్నాడు. అయితే డ్యామిట్ కథ అడ్డం తిరిగి మరేదో అయ్యింది. దెబ్బకు ముఖం వాచిపోయింది. ఇంతకీ అతను ఏం చేద్దామనుకున్నాడంటే… మట్టి తీయడానికి ఉపయోగించే ఇనుప పారకు ఒకవైపు టోపీని ఉంచి.. దాన్ని రజనీకాంత్ స్టైల్‌లో తన తలపైకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. అలా ఓ వైపు పారకు టోపీని ఉంచి.. మరో వైపు కాలితో తొక్కాడు. అలా చేస్తే.. టోపీ ఎగిరి తన తలపై నిలిచేలా చేయాలన్నది అతని ఆలోచన. పాపం.. అతను ఒకటి అనుకుంటే.. అక్కడ జరిగింది మాత్రం మరొకటి. ఓ వైపు పారను బలంగా తొక్కగానే.. మరో వైపు పార మొన వచ్చి అతని మొఖానికి బలంగా తాకింది. ఈ ఫన్నీ సీన్ మొత్తం అక్కడున్న ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పడు ఈ వీడియో నెట్టింట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. మరి ఆ ఫన్నీ సీన్ మీరూ చూసేయండి.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

