Noise Colorfit Vision-3: యాపిల్ డిజైన్‌తో నాయిస్ నుంచి నయా స్మార్ట్ వాచ్.. ఫీచర్లు, ధరెంతో తెలుసుకోండి

కొన్ని కంపెనీలు యాపిల్ డిజైన్‌ను మైమరపించేలా సరికొత్తగా స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా నాయిస్ కంపెనీ కలర్ ఫిట్ విజన్ 3 పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ. 4,999గా ఉంది. ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఈ వాచ్ కేవలం రూ.3999కే అందిస్తున్నారు.

Noise Colorfit Vision-3: యాపిల్ డిజైన్‌తో నాయిస్ నుంచి నయా స్మార్ట్ వాచ్.. ఫీచర్లు, ధరెంతో తెలుసుకోండి
Noise Colorfit Vision 3
Follow us
Srinu

|

Updated on: Jun 28, 2023 | 6:45 PM

ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువ స్మార్ట్ యాక్ససరీస్‌ను ఉపయోగిస్తుంది. వీటిలో ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లపై మక్కువ చూపుతున్నారు. గతంలో కేవలం టైం చూసుకోడానికి మాత్రమే ఉపయోగించే ఈ వాచ్‌లు మరిన్ని ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్‌గా మారి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాచ్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ వాచ్‌లో సాధారణంగా యాపిల్ వాచ్‌లంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దీంతో కొన్ని కంపెనీలు యాపిల్ డిజైన్‌ను మైమరపించేలా సరికొత్తగా స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా నాయిస్ కంపెనీ కలర్ ఫిట్ విజన్ 3 పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ. 4,999గా ఉంది. ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఈ వాచ్ కేవలం రూ.3999కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ జెట్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, జెట్ బ్లాక్, ఎలైట్ ఎడిషన్, గ్లోసీ సిల్వర్ ఎలైట్ ఎడిషన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ వాచ్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ వాచ్ యాపిల్ అల్ట్రా వాచ్ మాదిరిగానే ఉంటుంది. అలాగే ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, మరిన్ని ఇతర ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్‌ఫిట్ విజన్ 3 ఫంక్షనల్ క్రౌన్‌ను కలిగి ఉంది. అలాగే 1.96 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే (మెటల్ ఫ్రేమ్‌తో) వస్తుంది. అలాగే ఇది 550 నిట్స్ బ్రైట్‌నెస్, 410×502 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (ఏఓడీ) ఎంపిక, 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతో యువతను ఎక్కువగా ఆకట్టుకునేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. అదనంగా ఈ వాచ్‌లో రెండు మెను యూఐ ఎంపికలను పొందుతారు. ఈ వాచ్ ట్రై సింక్ టెక్నాలజీ-ఆధారిత బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

ఈ వాచ్ స్థిరమైన కాల్స్, వేగవంతమైన కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. అలాగే ఈ వాచ్ బ్లూటూత్ 5.3కి సపోర్ట్ ఉంటుంది. కలర్‌ఫిట్ విజన్ 3 సాధారణ హార్ట్ రేట్ సెన్సార్, ఎస్పీఓ2 మానిటర్, స్లీప్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్, ఒత్తిడిని నిర్వహించగల సామర్థ్యం, శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయగల సామర్థ్యంతో వస్తుంది. మీరు అవుట్‌డోర్ రన్నింగ్, వాకింగ్ కోసం ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్‌తో పాటు 100 స్పోర్ట్స్ మోడ్‌లు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అలాగే ఈ వాచ్ నాయిస్ ఫిట్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. అలాగే ఈ వాచ్ ఏడు రోజుల బ్యాటరీ జీవితాన్ని పొందుతారు అదనపు ఫీచర్‌లతో వాతావరణ అప్‌డేట్‌లు, కాలిక్యులేటర్, స్టాక్ అప్‌డేట్‌లు, స్మార్ట్ డీఎన్డీ, రిమోట్ సంగీతం నియంత్రణలతో వస్తుంది. అలాగే ఈ వాచ్ ఐపీ 68 రేటింగ్‌తో నీరు, ధూళి నిరోధకతతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..