Chandrayaan 3 Launch: చంద్రయాన్-3 ప్రయోగ తేదీ ఖరారు.. ప్రకటించిన ఇస్రో
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగ తేదీని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2తో శాస్త్రవేత్తలతో దేశ ప్రజలు కూడా నిరాశ చెందారు. శ్రీహరికోట నుంచి ప్రయోగం చేపట్టిన తర్వాత చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ల్యాండింగ్ సక్సెస్..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగ తేదీని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. చంద్రయాన్-3ని జూలై 13 మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ ప్రయోగం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అంతకుముందు సెప్టెంబరు 7, 2019న, భారతదేశం ‘చంద్రయాన్-2’ ప్రయోగించిన విషయం తెలిసిందే. కానీ చంద్రుని ఉపరితలంపై సరిగ్గా ల్యాండ్ కాకపోవడంతో విజయవంతం కాలేకపోయింది. ఇది చంద్రుని ఉపరితలం దక్షిణ ధ్రువం దగ్గర దిగాల్సి ఉంది. చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా, ల్యాండర్ విక్రమ్‌తో దాని సంబంధాలు తెగిపోయాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
చంద్రయాన్-3లో సమస్య తలెత్తకుండా మార్పులు:
కాగా, జూలై 13న ఈ చంద్రయాన్-3 ప్రయోగంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో ముందస్తుగానే చర్యలు చేపట్టింది. సమస్యలను నిరోధించేందుకు హార్డ్ వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్, సాఫ్ట్ వేర్, సెన్సార్లలో కీలక మార్పులు చేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అలాగే ల్యాండింగ్ సమయంలో కిందికి దిగి సమయంలో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు.
7 కి.మీ నుంచే ల్యాండింగ్ ప్రారంభం
ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో ఎత్తు, ల్యాండింగ్ ప్రదేశం, వేగం, రాళ్ల నుంచి ల్యాండర్‌ను రక్షించడంలో ఈ సెన్సార్లు సహాయపడతాయి. చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై 7 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండింగ్ ప్రారంభమవుతుంది. 2 కి.మీ ఎత్తుకు చేరుకున్న వెంటనే సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి. వీటి ప్రకారం ల్యాండర్ దాని దిశ, వేగం, ల్యాండింగ్ సైట్‌ను నిర్ణయిస్తుంది.
ఈసారి ల్యాండింగ్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే సెన్సార్లు, బూస్టర్ల సమస్యల కారణంగా చంద్రయాన్-2 కష్టతరంగా ల్యాండింగ్ అయింది. చంద్రయాన్-2 ఉపరితలం నుంచి దాదాపు 350 మీటర్ల ఎత్తు నుంచి వేగంగా తిరుగుతుండగా పడిపోయింది. ల్యాండర్, రోవర్ చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో సంబంధాన్ని కొనసాగించాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చంద్రయాన్-2 వంటి ఐదు ఇంజన్లు ఉండవు
చంద్రయాన్-2 ల్యాండర్ వలె చంద్రయాన్-3కి ల్యాండర్‌లో ఐదు కాకుండా నాలుగు థొరెటల్ ఇంజన్లు ఉంటాయి. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌లో ఐదు థొరెటల్ ఇంజన్లు ఉన్నాయి. అందులో ఒక లోపం కారణంగా ల్యాండింగ్ చెడిపోయింది. ఈసారి చంద్రయాన్-3 ల్యాండర్‌లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ (ఎల్‌డివి)ని అమర్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇది ల్యాండింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. అందుకే ఆర్బిటర్ ఈ సమాచారాన్ని సేకరిస్తుంది. దానిని భూమికి ప్రసారం అయ్యేలా చేస్తారు. చంద్రయాన్-3ని GSLV-MK-3 (GLSV-MK-3) రాకెట్ నుంచి ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇందులో ల్యాండర్, రోవర్‌లను పరీక్షించారు. ల్యాండర్-రోవర్ కదలికను సరిగ్గా పరిశోధించడానికి వీలుగా సరైన టెక్నాలజీ ఉపయోగించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి