Max Pro Nitro Smartwatch: సరసమైన ధర.. స్టన్నింగ్ ఫీచర్లతో మ్యాక్సిమా కొత్త స్మార్ట్ వాచ్.. వివరాలివి..
ప్రీమియం మెటాలిక్ డిజైన్ తో కూడిన బాడీ తో కూడిన మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో నిట్రో స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్ నెస్ తో ఇది వస్తుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. రియల్ టెక్ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి.
మార్కెట్లోకి మరో స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది. స్మార్ట్ వాచ్ ఉత్పత్తిలో మంచి పేరు గడించిన బ్రాండ్ మ్యాక్సిమా నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్ విడుదలైంది. మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో నిట్రో పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ స్టైలిష్ లుక్ తో పాటు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. అనువైన బడ్జెట్లో అత్యద్భుత అనుభవాన్ని వినియోగదారులకు అందస్తుందని మ్యాక్సిమా కంపెనీ ప్రకటించుకుంది. దీనిలో వందకు పైగా స్పోర్ట్స్ మోడ్లతో పాటు హెల్త్ అప్లికేషన్లు, హైవే కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇవే..
ప్రీమియం మెటాలిక్ డిజైన్ తో కూడిన బాడీ తో కూడిన మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో నిట్రో స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్ నెస్ తో ఇది వస్తుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. రియల్ టెక్ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఇన్ బిల్ట్ గేమ్స్, హెచ్ డీ స్పీకర్, మైక్ ఉంటుంది. ఈ వాచ్ ఐపీ67 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్. ఏఐ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. అలాగే హెల్త్ ఫీచర్లకు వచ్చే సరికి హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2, స్లీప్ క్లాలిటీ వంటివి పొందచ్చు.
మరిన్ని అడ్వాన్స్ డ్ ఫీచర్స్..
ఏఐ వాయిస్ అసిస్టెంట్ తో మ్యూజిక్, కెమెరా రిమోట్ కంట్రోల్స్, వెథర్ అప్ డేట్లు, కాలిక్యూలేటర్ వంటి వాటిని సింగిల్ వాయిస్ కమాండ్ తో నిర్వహించవచ్చు. అలాగే హెల్త్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు హార్ట్, పల్స్ మోనిటర్ చేసుకోవచ్చు. అనే స్లీప్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాక సోషల్ మీడియా నోటిఫికేషన్లను స్మార్ట్ వాచ్ లోనే చూసుకోవచ్చు. అలాగే డ్రింకింగ్ అలెర్ట్స్, అలారమ్, స్టాప్ వాచ్, టైమర్స్, మహిళలకు రుతుచక్రం ట్రాకర్ అందుబాటులో ఉంటుంది. అలాగే డీఎన్డీ/ పవర్ సేవర్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ధర, లభ్యత..
ఈ స్మార్ట్ వాచ్ పలు రకాల మెటాలిక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్పేస్ బ్లాక్, రోజ్ గోల్డ్ బ్లాక్, సిల్వర్ గ్రే విత్ సిలికాన్ స్ట్రాప్ ఉంటుంది. అనేక స్టన్నింగ్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ అమెజాన్ లో మే 7వ తేదీ నుంచ అందుబాటులో ఉంటుందని మ్యాక్సిమా మేనేజింగ్ డైరెక్టర్ మన్ జాట్ పూరీవాల్ అన్నారు. దీని ధర రూ. 1,499గా ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..