Nokia XR21: నోకియా నుంచి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్… నీరు, ధుళి కూడా ఈ ఫోన్‌ను ఏం చేయలేవు
ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్‌లో మార్కెట్‌ను అందుకోవడంలో కాస్త వెనకబడిందని చెప్పాలి. అయితే తాజాగా మళ్లీ వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది నోకియా. నోకియర్ ఎక్స్‌ఆర్ 21 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే కొన్ని దేశాల్లో...
ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్‌లో మార్కెట్‌ను అందుకోవడంలో కాస్త వెనకబడిందని చెప్పాలి. అయితే తాజాగా మళ్లీ వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది నోకియా. నోకియర్ ఎక్స్‌ఆర్ 21 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి రాగా త్వరలోనే భారత్‌లో సైతం అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ బాడీని అత్యంత దృఢంగా రూపొందించారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓ లుక్కేయండి.
నోకియా ఎక్స్‌ఆర్ 21 ఫోన్‌లో 6.49 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకత. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌తో, వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 4,800mAh పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు అమర్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మరో ప్రత్యేకత దీని బాడీ అని చెప్పొచ్చు. అత్యంత దృఢంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో నీటి, ధూళి రెసిస్టెంట్ కోసం IP69K రేటింగ్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ను కేవలం 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..