AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blaupunkt TV: మార్కెట్‌లోకి నయా స్మార్ట్‌ టీవీలు.. తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు..

అనూహ్యంగా స్మార్ట్‌టీవీలకు డిమాండ్‌ ఏర్పడడంతో టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ నయా ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ స్మార్ట్‌ టీవీలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ బ్లౌపంక్ట్‌ రెండు స్మార్ట్‌ టీవీలను రిలీజ్‌ చేసింది. 43 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీతో పాటు 55 అంగుళాల గూగుల్‌ టీవీలను రిలీజ్‌ చేసింది. సన్నటి ఫ్రేమ్‌తో డిస్ప్లేలు, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌తో ఆకర్షణీయంగా ఉంటుది. బ్లౌపంక్ట్‌ టీవీలపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Blaupunkt TV: మార్కెట్‌లోకి నయా స్మార్ట్‌ టీవీలు.. తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు..
Blaupunkt Tv
Nikhil
| Edited By: |

Updated on: Sep 30, 2023 | 10:23 PM

Share

భారతీయులకు టీవీలకు ఓ అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ‍గ్రామీణులకు టీవీలో సీరియల్స్‌ చూడకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా టీవీ తయారీలో వస్తున్న మార్పులు కారణంగా స్మార్ట్‌టీవీలు మార్కెట్‌లో హవా చూపుతున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పని చేసే స్మార్ట్‌ టీవీలు ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. అలాగే స్మార్ట్‌టీవీల్లో వచ్చే వివిధ యాప్స్‌ కారణంగా వారు చూడాల్సిన కార్యక్రమాలు వారికి ఖాళీ ఉండే సమయాల్లోనే చూసే వెసులుబాటు ఉండడంతో అందరూ స్మార్ట్‌టీవీలు కొనుగోలు చేస్తున్నారు. అనూహ్యంగా స్మార్ట్‌టీవీలకు డిమాండ్‌ ఏర్పడడంతో టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ నయా ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ స్మార్ట్‌ టీవీలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ బ్లౌపంక్ట్‌ రెండు స్మార్ట్‌ టీవీలను రిలీజ్‌ చేసింది. 43 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీతో పాటు 55 అంగుళాల గూగుల్‌ టీవీలను రిలీజ్‌ చేసింది. సన్నటి ఫ్రేమ్‌తో డిస్ప్లేలు, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌తో ఆకర్షణీయంగా ఉంటుది. బ్లౌపంక్ట్‌ టీవీలపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆఫర్లు ఇలా

43 అంగుళాల బ్లౌపంక్ట్‌ క్యూఎల్‌ఈడీ టీవీ ధర రూ.28,999గా ఉంది. అలాగే 55 అంగుళాల మోడల్ ధర రూ.34,999గా నిర్ణయించారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి

బ్లౌపంక్ట్‌ క్యూ ఎల్‌ఈడీ ఫీచర్లు 

  • ఈ స్మార్ట్‌ టీవీ హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్‌తో 43 అంగుళాల క్యూఎల్‌ఈడీ 4కే డిస్‌ప్లేతో వస్తుంది. 
  • డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్‌  ట్రూసరౌండ్ సౌండ్‌తో జత చేసిన 50 వాట్స్‌ స్పీకర్లు ఈ టీవీ ప్రత్యేకతలు
  • ఈ టీవీ గూగుల్‌ టీవీ అయినందున నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీహాట్‌స్టార్‌, యూట్యూబ్‌ వంటి అనేక యాప్స్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్‌ మోడ్‌తో పాటు అనేక గేమ్‌లను ఈ టీవీ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. 
  • ఈ టీవీలో అంతర్నిర్మిత బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే ఉన్నాయి. 
  • ఈ టీవీ గూగుల్‌ అసిస్టెంట్-పవర్డ్ రిమోట్‌తో వస్తుంది. 

బ్లౌపంక్ట్‌ 55 అంగుళాల టీవీ ఫీచర్లు

  • ఈ గూగుల్‌ స్మార్ట్‌ టీవీ కూడా హెచ్‌డీ 10 ప్లస్‌తో 4కే యూహెచ్‌డీ ఎల్‌ఈడీ బెజెల్-లెస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీ అల్లాయ్ స్టాండ్‌తో కూడా వస్తుంది. 
  • గూగుల్‌ టీవీ డీటీఎస్‌ ట్రూ సరౌండ్‌ టెక్నాలజీ, డాల్బీ డిజిటల్‌ ప్లస్‌తో 60 వట్స్‌ స్టీరియో బాక్స్‌ స్పీకర్‌ సిస్టమ్‌తో వస్తుంది. 
  • ఈ టీవీ 2 జీబీ + 16 జీబీ వేరియంట్‌లో వస్తుంది. ఈ టీవీ మాలీ జీ 52 జీపీయూతో జత చేసిన మీడియాటెక్‌ ఎంటీ 9062 ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తుంది. 
  • ఈ టీవీ బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లతో వస్తున్నాయి. 
  • ఈ టీవీతో అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్‌తో పాటు ఎయిర్‌ప్లేతో పని చేస్తుంది. ఈ టీవీ కూడా గూగుల్‌ అసిస్టెంట్-పవర్డ్ రిమోట్‌తో వస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..