AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube New Feature: యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ ప్రస్తుతం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ‘ప్లే లాస్ట్ ఇన్ క్యూ’ ఫీచర్ ను పరిశీలిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు రకాల మొబైల్స్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Youtube New Feature: యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్
Youtube Channels Block
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 27, 2022 | 5:24 PM

Share

యూట్యూబ్ ప్రతి ఒక్కరూ టైంపాస్ కోసం ఈ యాప్ నే వినియోగిస్తున్నారు. అనేక చానళ్లు కూడా ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంటున్నాయి. అందుకు అనుగుణంగా యూట్యూబ్ కూడా సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం వచ్చిన ఆండ్రాయిడ్ టీవీల పుణ్యమా అని గృహిణులు కూడా యూట్యూబ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలకు కూడా కిడ్స్ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా అన్ని వర్గాల ప్రజలను, అన్ని వయస్సుల వారిని యూట్యూబ్ తనవైపునకు తిప్పుకుంటుంది. మరే ఇతర వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు ఇంతటి ఆదరణ లేదు.  యూట్యూబ్ ప్రస్తుతం కొత్త ఫీచర్లలో భాగంగానే ‘ప్లే లాస్ట్ ఇన్ క్యూ’ ఫీచర్ ను పరిశీలిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు రకాల మొబైల్స్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్యూ సిస్టమ్ యూట్యూబ్ వెబ్ వెర్షన్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫీచర్ మొబైల్స్ వర్షన్ లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులు ఈ ఫీచర్ ను ఆన్ చేశాక వీడియో థంబ్ నెయిల్ మెనూ లో ప్లే లాస్ట్ ఇన్ క్యూ ఆప్షన్ ను కనుగొంటారని నివేదికలు పేర్కొంటున్నాయి. వీడియో ముగిసే సమయానికి తర్వాత వీడియోను క్యూ లో ప్లే చేస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న జాబితాలో వీడియోలు అయ్యే వరకూ ప్లే అవుతాయి. ఈ ఫీచర్ ను మాన్యువల్ గా ఆన్ చేయడానికి యూట్యూబ్ లోని ప్రొఫైల్ పిక్ సెలెక్ట్ చేయాలి. అక్కడ కనిపించే ఆప్షన్స్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ ట్రై న్యూ ఫీచర్స్ ను ఆప్షన్ సెలెక్ట్ చేసి, క్యూ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలోనే ఉందని తెలుస్తోంది. 

మూడు యూట్యూబ్ చానెల్స్ పై వేటు

ఇటీవల పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం ద్వారా వచ్చిన నివేదిక ప్రకారం యూట్యూబ్ లో ఫేక్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానల్స్ పై కొరఢా ఝులిపించింది. న్యూస్ హెడ్ లైన్స్, సర్కారీ అప్ డేట్, ఆజ్ తక్ లైవ్ చానల్స్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ చాన్సల్ కు 33 లక్షల మంది సబ్స్ స్కైబర్లు ఉన్నారు. ఈ చానల్స్ లో పోస్ట్ చేసిన వీడియోలన్నీ నకీలేవనని తేలడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది. అయితే వ్యక్తిగత పోస్ట్ లకు వ్యతిరేకంగా పీఐబీ యూట్యూబ్ చానల్స్ పై చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.