AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌తో పెట్రోల్ ఆదా.. అదెలా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

గూగుల్ మ్యాప్స్ లో ఈ సేవింగ్ ఫ్యూయల్ ఫీచర్ 2022లోనే ఆవిష్కరించారు. అయితే మొదటిగా యూఎస్, కెనడా, యూరోప్ దేశాలలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో కూడా దీనిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త ఫీచర్ యాప్ లో యాడ్ అవడంతో మీ వాడే బండిలో వాడే ఇంధనం (పెట్రోల్/డీజిల్/సీఎన్జీ/విద్యుత్) ఆదా అవుతుంది. అదెలా సాధ్యం అంటే..

Google Maps: గూగుల్ మ్యాప్స్‌తో పెట్రోల్ ఆదా.. అదెలా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
Google Maps
Madhu
| Edited By: |

Updated on: Dec 15, 2023 | 7:50 PM

Share

గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది తెలియని వారు పెద్దగా ఉండరేమో. ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లినా? అడ్రస్ సరిగ్గా తెలియక పోయినా గూగుల్ మ్యాప్స్ ఆధారంగానే వెళ్లగలుగుతున్నారు. ఎంచక్కా నావిగేషన్ పెట్టుకొని ముందుకు వెళ్లిపోతున్నారు. ఇక ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లు, ర్యాపిడో బైక్స్ అయితే ఈ మ్యాప్స్ ఆధారంగానే నడుస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ గూగుల్ మ్యాప్స్ లో ఓ కొత్త ఫీచర్ మన దేశంలోని వినియోగదారులకు పరిచయం అయ్యింది. దీని పేరు ఫ్యూయల్ సేవింగ్ అంటే మీ బైక్ లేదా కారు ఇంధనాన్ని ఆదా చేసే ఫీచర్. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని పూర్తి చదవండి.

సేవింగ్ ఫ్యూయల్ ఫీచర్..

గూగుల్ మ్యాప్స్ లో ఈ సేవింగ్ ఫ్యూయల్ ఫీచర్ 2022లోనే ఆవిష్కరించారు. అయితే మొదటిగా యూఎస్, కెనడా, యూరోప్ దేశాలలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో కూడా దీనిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త ఫీచర్ యాప్ లో యాడ్ అవడంతో మీ వాడే బండిలో వాడే ఇంధనం (పెట్రోల్/డీజిల్/సీఎన్జీ/విద్యుత్) ఆదా అవుతుంది. అదెలా సాధ్యం అంటే..

గూగుల్ మ్యాప్స్ వినియోగించి మీరు వాహనాన్ని నడుపుతున్నప్పుడు మీరు వాడే వాహనం ఇంజిన్ రకాన్ని బట్టి మీకు వివిధ మార్గాలు, ఆయా రూట్లలో వెళ్లడం వల్ల ఆదా అయ్యే ఇంధన వివరాల అంచనాలను చూపిస్తుంది. అలాగే లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, రహదారి పరిస్థితులతో పాటు ఇంధనం ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తుంది. అంతేకాక మీరు వెళ్లే వేగం, ఇంధన సంరక్షణ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యంత అనుకూలమైన మార్గాన్ని లెక్కిస్తుంది. మీ మార్గాలు మారినప్పటికీ, యాప్ అత్యంత సమర్థనీయమైన ఇంధన ఆదా మార్గాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే వేగవంతమైన మార్గాన్ని ప్రదర్శించకుండా వేరు చేస్తుంది. అలాగే గ్రీన్ లీఫ్ సింబల్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లలో అత్యంత పర్యావరణ అనుకూల మార్గాన్ని చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ యాక్టివేషన్..

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను తెరవండి.
  • మీ ప్రొఫైల్ చిత్రాన్ని లేదా పేరును నొక్కండి.
  • సెట్టింగ్‌లలోకి వెళ్లి, నావిగేషన్‌పై నొక్కండి.
  • రూట్ ఆప్షన్లకి స్క్రోల్ చేయండి.
  • “ప్రిఫర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ రూట్స్” ఆప్షన్ పై క్లిక్ చేసి ఎకో ఫ్రెండ్లీ రూట్ ని ఎంచుకోవచ్చు.
  • మీ ఇంజిన్ రకాన్ని ఎంచుకోవడానికి, “ఇంజిన్ టైప్”ను తదనుగుణంగా ఎంచుకోండి.
  • మీ గమ్యస్థానం కోసం శోధించండి లేదా మ్యాప్‌లో నొక్కండి.
  • దిగువ ఎడమవైపున, డైరెక్షన్స్ అనే ఆప్షన్ నొక్కండి.
  • దిగువ బార్‌లో పైకి స్వైప్ చేయండి.
  • ‘చేంజ్ ఇంజిన్ టైప్’ ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత డన్ అనే బటన్ పై క్లిక్ చేయండి.

ఫ్యూయల్ ఎఫీషియెంట్ మార్గం మీ బండి ఇంజిన్ రకాన్ని బట్టి మారుతుంటుంది. ఇక్కడ సరైన ఇంజిన్ రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. డీజిల్ వాహనాలు తరచుగా హైవేలపై మెరుగ్గా పనిచేస్తాయి. అయితే హైబ్రిడ్. ఎలక్ట్రిక్ వాహనాలు పునరుత్పత్తి బ్రేకింగ్ కారణంగా నగరం లేదా కొండ ప్రాంతాలలో ఎక్కువ రేంజ్ ఇస్తాయి. మీరు మీ ఇంజిన్ రకాన్ని ఎన్నుకోకపోతే, పెట్రోల్ డిఫాల్ట్‌గా మారుతుంది. ఎందుకంటే ఇది చాలా దేశాలలో అత్యంత సాధారణ ఇంజిన్ రకం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్