Smartwatch: కేవలం రూ.1,999లకే ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ ఇండియాలో రిలీజ్.. అద్భుతమైన ఫీచర్స్, వివరాలు చెక్ చేసుకోండి..
స్మార్ట్‌వాచ్ లలో లేటెస్ట్ ఫీచర్లు, సౌకర్యలు ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే తక్కువ ధరకే ఎన్నో ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్‌వాచ్ లలో లేటెస్ట్ ఫీచర్లు, సౌకర్యలు ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే తక్కువ ధరకే ఎన్నో ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ లైనప్ లో ఇప్పుడు ఫైర్ బోల్ట్ నుంచి సరికొత్త వాచ్ వచ్చేసింది. దాని పేరు ఫైర్ బోల్ట్ ఎటర్నో. ఫైర్ బోల్ట్ తన ఫైర్ బోల్ట్ ఎటర్నో స్మార్ట్ వాచ్ ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ వాచ్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ వాచ్ కి 1.99″ డిస్‌ప్లే సైజ్‌తో పెద్ద టచ్ ఏరియాతో వస్తుంది. 240*283 పిక్సెల్‌లు, 500 NITS బ్రైట్ నెస్ ఇంకా పెద్ద డిస్‌ప్లే ఉండటంతో వాచ్ బెజెల్ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించదు. కస్టమర్ కు సులభంగా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. ఈ వాచ్‌లో కనిపించే అక్షరాలు కూడా పెద్దవిగా ఉంటాయి. ఈ కారణంగా, మీరు వాచ్ను దగ్గరగా చూడకుండానే మీకు కావలసిన సమాచారాన్ని సులభంగా చూసుకునే అవకాశం ఉంది.
ఫైర్ బోల్ట్ ఎటర్నో వర్సెస్ ఫైర్ బోల్ట్ టెర్మినేటర్ సాఫ్ట్ వేర్:




రెండు స్మార్ట్ వాచ్ లు బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్, ఇన్ బిల్ట్ గేమ్స్ తో వస్తాయి. స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, బ్రీథర్ ట్రైనింగ్ లో ప్యాక్ చేసే ఫిట్ నెస్, వర్కౌట్ ల కోసం హెల్త్ సూట్ రెండు ఆఫర్లలో అందుబాటులో ఉంది. రెండు వాచీలలో వెదర్ అప్ డేట్స్ తోపాటు కెమెరా, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే టెర్మినేటర్ స్క్రీన్ ఫ్లాష్ లైట్ తో కూడా వస్తుంది. రెండు స్ప్లిట్ స్క్రీన్ బ్రౌజర్ యూఐతో వస్తుంది. ఎటర్నో, టెర్మినేటర్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, 120ప్లస్ స్పోర్ట్స్ మోడ్ ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ:
ఎటర్నో 280ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. వెబ్ సైట్లో టెర్మినేటర్ బ్యాటరీ కెపాసిటి లేదు. దాని లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఐదురోజుల వరకు ఉంటుంది.
ధర:
ఫైర్ బోల్ట్ టెర్నినేటర్ లాంచ్ సమయంలో ఆఫర్ ధర రూ. 1,999రూపాయలకు అందుబాటులో ఉంది. ఎటర్నో స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్టులో 2,299అందుబాటులో ఉండగా. ఇది ఐదు రంగుల్లో వస్తుంది. బ్లాక్, బ్లూ, సిల్వర్ గ్రీన్, బ్లాక్ సిల్వర్, గోల్డ్ పింక్ రంగుల్లో వస్తుంది. టెర్మొనేటర్ బ్లాక్, డార్క్ గ్రే, బ్లూ, సిల్వర్ గ్రే, గోల్డ్ పింక్, సిల్వర్ గ్రీన్ అనే ఆరు రంగుల్లో వస్తుంది.
ముఖ్యంగా 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. లేటెస్ట్ సెన్సార్లు, టెక్నాలజీతోపాటు అన్ని యాక్టివిటీస్ ఇందులో చూడవచ్చు. అంతేకాదు ఖాళీగా ఉన్నప్పుడు మీర కాసేపు ఈ స్మార్ట్ వచా్ లో గేమ్స్ కూడా ఆడవచ్చు. దీని కోసం ఇందులో కొన్ని ఇంటర్నల్ గేమ్స్ కూడా ఉన్నాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం