Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: త్వరలో ఐక్యూ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ఫీచర్లు, ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రముఖ మొబైల్ తయారీదారుకంపెనీ ఐక్యూ జెడ్ 7 5జీ పేరుతో మార్చి 21న స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనుంది. ఈస్మార్ట్ ఫోన్లో ఎన్నో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 64మెగాపిక్సెల్ ఓఐఎస్ఎస్ అల్ట్రా స్టేబుల్ కెమెరాతో రాబోతోంది.

Smartphone: త్వరలో ఐక్యూ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ఫీచర్లు, ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Iqoo Smartphone
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 19, 2023 | 9:53 PM

ఐక్యూ దాని బలమైన ప్రాసెసింగ్, కెమెరా ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. ఇది భారత మార్కెట్లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ గా అవతరించనుంది. ఐక్యూ ఈ ఫోన్ బెస్ట్ ఇన్ క్లాస్ హార్డ్ వేడ్ స్పెసిఫికేషన్, సాఫ్ట్ వేర్ తో అమర్చబడి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయడానికి ముందు కంపెనీ దాని ఫీచర్లు, ధర, ఆఫర్ల గురించి లీక్స్ ఇచ్చింది.

ఫీచర్లు..

ఐక్యూ జెడ్ 7 5జీ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్ మీడియాటెక్ డెమిన్టిస్టి 9205జీ ప్రాసెసర్ తో రానుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 64మెగాపిక్సెల్ ఓఐఎఎస్ అల్ట్రా స్టేబుల్ కెమెరా అందుబాటులో ఉంది. దీనితో పాటు, సూపర్ నైట్ మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రాబోతోంది. ఈ ఫోన్ కేవలం 25 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

ధర వివరాలు..

కంపెనీ iQOO Z7 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేయబోతోంది . వీటి ధరలను కంపెనీ వెల్లడించింది. iQOO Z7 5G, 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించింది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌ల నుండి ఇఎంఐ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగులు చేయడానికి రూ.1500 తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫోన్ ధర రూ.17,999. అదేవిధంగా, 8GB RAM, 128GB స్టోరేజీతో iQOO Z7 5G వేరియంట్ ధర రూ.19,999కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత, దీని ధర రూ. 18,499 కొనుగోలు చేయవచ్చు . కంపెనీ మార్చి 21న భారత్ లో iQOO Z7 5Gను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ , iQOO   ఇ-స్టోర్ నుండి నాన్ బ్లూ, పసిఫిక్ నైట్ రెండు కలర్ ఆప్షన్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.