నాసా మరో అద్భుతం… అరుదైన ఏలియన్ రాయి గుర్తింపు.. ఇది ఎలా ఉందంటే..?
అంగారకుడిపై అరుదైన ఏలియన్ రాక్‌ను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంగారకుడిపై ఉన్న మిగతా రాళ్లతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంది. దీంతో ఈ రాయి అంగారకుడిపైకి ఎలా వచ్చిందనే దానిపై నాసా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. మిగతా వివరాల్లోకి వెళ్తే

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలో చోటుచేసుకునే సంఘటనలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను సైంటిస్టులు కనిపెడుతున్నారు. అంతరిక్షంలో చోటుచేసుకునే అద్బుతాలు, కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయాలను శాస్త్రవేత్తలు బయటపెడుతున్నారు. అంగారకుడిపై కొన్నేళ్లుగా ఎన్నో ప్రయోగాలు నాసా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అంగారకుడిపై ఒక మిస్టీరియస్ రాయిని కనిపెట్టింది. ఈ రాయి అక్కడి సహజవనరులతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించినట్లు నానా గుర్తించింది.
దాదాపు 80 సెంటిమీటర్ల పొడవు ఉన్న ఈ రాయికి నాసా సైంటిస్టులు ‘ఫిప్సాక్స్‌లా’ అనే పేరు పెట్టారు. సెప్టెంబర్ 19న అంగారకుడిపై ఈ రాయిని కనిపెట్టగా.. దీనిని ఏలియన్ రాక్‌గా పిలుస్తున్నారు. అంగారకుడిపైకి నాసా పెర్సెవరెన్స్ అనే రోవర్ గతంలో పంపింది. ఆ రోవర్ ఈ రాయిని గుర్తించి ఫొటోలు పంపింది. ఈ ఫొటోలను నాసా తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ‘ఫిప్సాక్స్‌లా’ అని పిలవబడుతున్న ఈ రాయి సౌరవ్యవస్థకు చెందినదిగా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ రాయిపై నాసా నిశితంగా పరిశోధనలు చేస్తోంది. ఈ రాయి ఆకారం, పొడవు, వెడల్పు చూస్తే అక్కడ ఉన్న రాళ్లకు భిన్నంగా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఈ రాయిలో నికెల్, ఐరన్ మూలకాలు ఎక్కువ మోతాదులో ఉన్నట్లు నాసా గర్తించింది. దీంతో సౌరవ్యవస్థ నుంచి అంగారకుడిపైకి ఈ రాయి ఉండి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.నాసా పంపిన రోవర్ గతంలో లెబవాన్ ఉల్క, కాకో ఉల్కలను గుర్తించింది. ఆ తర్వాత ఇప్పుడు మిస్టీరియస్ రాయిని గుర్తించింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




