AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Phones: ‘రియల్ మీ’ నుంచి అదిరిపోయే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు.. నేడే లాంచ్.. ఫీచర్లు ఇవే..

రియల్ మీ మరో రెండు స్మార్ట్‌ఫోన్లను ఇవాళ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ రెండిటిల్లో ఒకటి జీటీ 8 ప్రో కాగా.. మరొకటి జీటీ 8 డ్రీమ్ ఎడిషన్. వీటి వివరాలు చూద్దాం.

Realme Phones: 'రియల్ మీ' నుంచి అదిరిపోయే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు.. నేడే లాంచ్.. ఫీచర్లు ఇవే..
Realme Gt 8 Pro
Venkatrao Lella
|

Updated on: Nov 20, 2025 | 3:31 PM

Share

Realme GT 8 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్ధ ‘రియల్ మీ’ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్లతో కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇతర సంస్థలకు పోటీగా అడ్వాన్స్ ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు ఏఐ టెక్నాలజీతో కూడిన ఫోన్లను తీసకొస్తుంది. తాజాగా జీటీ సిరీస్‌లో భాగంగా జీటీ 8 ప్రో, జీటీ 8 డ్రీమ్ ఎడిషన్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఏంటి.. ? దీని ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్ మీ జీటీ 8 ప్రో ఫీచర్లు

-6.79 అంగుళాల QHD+BOE Q10 ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

-144Hz రిఫ్రెష్‌రేటు

-2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌

-గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌

-స్నాప్‌డ్రాగన్‌ 8 Elite జెన్ 5 ప్రాసెసర్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత యూఐ 7.0

-50 ఎంపీ సోనీ IMX906 ప్రధాన కెమెరా

-50 ఎంపీ అల్ట్రావైడ్, 200 ఎంపీ టెలిఫొటోట్రిపుల్‌ రేర్‌ కెమెరా

-32 ఎంపీ సెల్ఫీ కెమెరా

-7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

-120W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

రియల్ మీ జీటీ 8 ప్రో రెండు వేరియెంట్స్‌లో అందుబాటులో ఉంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.72,999గా ఉండగా.. 16జీబీ+ 512జీబీ వేరియంట్‌ ధర రూ.78,999గా ఉంది. అటు రియల్‌మీ జీటీ 8 ప్రో డ్రీమ్‌ ఎడిషన్‌ ఒకే వేరియంట్ (16జీబీ+512జీబీ)లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.80 వేలుగా ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి