ఈ నెలలో మార్కెట్లోకి iQOO 15.. ఆసక్తి రేపుతోన్న కొత్త ఫీచర్లు..
వన్‌ప్లస్‌కు పోటీగా iQOO మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. గతంలో తెచ్చిన iQOO 13కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా దీనిని నవంబర్‌లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర ఎంత..? ఫీచర్లు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

iQOO 15 India price: స్మార్ట్‌ఫోర్ తయారీ కంపెనీలు పోటీ పడి మరీ అప్‌డేటెడ్ వెర్షన్ ఫోన్లను మార్కెట్‌లోకి వేగంగా లాంచ్ చేస్తు్న్నాయి. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు అనేక రకాల కొత్త ఫీచర్లను జోడిస్తు్న్నాయి. ఏఐ ఫీచర్లను కూడా ఫోన్లలో చేర్చుతున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ iQOO తన అప్‌డేటెడ్ వెర్షన్ 15 సిరీస్ ఫోన్లను నవంబర్ 26న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
iQOO 15 ఫోన్ ఫీచర్లు ఇవే
144 Hz రిఫ్రెష్ రేట్ 508 ppi పిక్సెల్ డెన్సిటీతో 6.85-అంగుళాల 2K Samsung M14 AMOLED డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ అడ్రినో 840 GPU Q3 గేమింగ్ చిప్ 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ IP68/IP69 రేటింగ్
ఈ ఫోన్ రెండు వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. . 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 72,999గా ఉండగా.. 16 జీబీ ర్యామ్+ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999గా ఉంది. ఈ ఫెన్ రెండు రంగుల్లో ఉండనుంది. ఒకటిఆల్పా, రెండోవది లెజెండ్ రంగుల్లో లభించనుంది. ప్రముఖ అ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్లను విక్రయించనున్నారు. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ విడుదల కాగా.. ఇప్పుడు భారత్‌లో కూడా లాంచ్ చేయనున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




